సరదాగా స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు

సరదాగా స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు: వీడియో వైరల్

చాలా మంది పిల్లలు తల కిందులుగా దూకుతుంటారు. సరదాగా గంతులేస్తూ.. తలకిందులుగా దూకుతూ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సరదా స్టంట్ చేయబోయి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

Advertisements

చిన్న జాగ్రత్తలు మీ జీవితాన్ని కాపాడతాయి

‘మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు సరదాగా స్టంట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు. అతడి మెడ ఎముక విరిగిపోయింది. ఇలా చేయొద్దు. చిన్న జాగ్రత్తలు మీ జీవితాన్ని కాపాడతాయి’ అనే క్యాప్షన్‌తో బాబా బెనారస్ అనే యూజర్ ఎక్స్‌లో ఫిబ్రవరి 10న ఓ వీడియోను పోస్టు చేశారు.
యూజర్ పోస్టు చేసిన వీడియో నిజమేనా అని తెలుసుకోవడం కోసం సజగ్ టీమ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. కీ ఫ్రేమ్స్‌ను గూగుల్ లెన్స్ ద్వారా సెర్చ్ చేయగా.. దీనికి సంబంధించిన వీడియోలు బయటకొచ్చాయి. అడ్మిన్ మీడియా అనే తమిళ బ్లాగ్‌లో రాసిన ఓ కథనం కనిపించింది.

సరదాగా స్టంట్లు
అలాగే దైనిక్ భాస్కర్ హిందీ న్యూస్ వెబ్‌సైట్లో రాసిన కథనం కూడా కనిపించింది. దైనిక్ భాస్కర్‌లో కనిపించిన వివరాల ప్రకారం 2024 డిసెంబర్ 13న ఈ ఘటన చోటు చేసుకుంది. వీధుల్లో దుప్పట్లు, బ్లాంకెట్లు అమ్ముకునే 18 ఏళ్ల యువకుడు మహారాష్ట్రలోని బేలాపూర్‌లో సరదాగా స్టంట్లు చేసే క్రమంలో చనిపోయాడని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఫ్రీ ప్రెస్ జర్నల్ వెబ్‌సైట్లో
సంబంధిత కీవర్డ్స్‌తో గూగుల్‌లో వెతకగా.. ఫ్రీ ప్రెస్ జర్నల్ వెబ్‌సైట్లో రాసిన కథనాన్ని సజగ్ టీమ్ గుర్తించింది. తలకిందులుగా దూకే ప్రయత్నంలో యువకుడి తల ముందుగా నేలను తాకడంతో.. అతడి మెడ విరిగిపోయిందని.. ఆరు రోజులపాటు హాస్పిటల్‌లో చికిత్స పొందిన యువకుడు మరణించాడని ఈ కథనంలో పేర్కొన్నారు. మహారాష్ట్రలో బ్లాంకెట్స్ అమ్ముకుని జీవించే ఈ యువకుడు.. డిసెంబర్ 13వ తేదీన ఉదయం ఓ ఇంటి ముందు తన స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో.. నేలపై పరిచిన బ్లాంకెట్స్ మీద సరదాగా స్టంట్స్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని ఈ కథనంలో వెల్లడించారు.

Related Posts
మహాకుంభ్‌ పై దీదీ ఘాటు వ్యాఖ్యలు
మహాకుంభ్‌ పై దీదీ ఘాటు వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాను మృత్యు కుంభ్‌గా అభివర్ణిస్తూ, అక్కడ ఉన్న ప్రణాళికలపై Read more

మంత్రిపై బురద జల్లి నిరసన తెలిపిన వరద బాధితులు
Villupuram Locals Throw Mud

తమిళనాడులో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన మంత్రి తిరు పొన్ముడికి చేదు అనుభవం ఎదురైంది. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులు ఆయనపై బురద జల్లి Read more

IPL 2025: ముంబై ఇండియన్ కెప్టెన్ గా సూర్యకుమార్
sports: ముంబయి ఇండియన్ కెప్టెన్ గా సూర్యకుమార్

ముంబై ఇండియన్స్‌ తొలి మ్యాచ్‌కు హార్దిక్ దూరం – సారథిగా సూర్యకుమార్ యాదవ్ మొదటి మ్యాచ్‌కు హార్దిక్‌ పాండ్యా దూరం 2025 ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ Read more

సనాతన ధర్మంపై సుప్రీం కోర్ట్ ఘాటు వ్యాఖ్యలు
సనాతన ధర్మంపై ఉత్కంఠ - సుప్రీంకోర్టు తీర్పు రాజకీయ దుమారం రేపుతుందా?

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలు ఎఫ్ఐఆర్‌లు నమోదైన నేపథ్యంలో, తాజాగా భారత సుప్రీంకోర్టు ఆయనకు పెద్ద ఊరట కలిగించే Read more