గోవా టూరిజం తగ్గిపోతోందా?

గోవా టూరిజం తగ్గిపోతోందా?

గోవా వైబ్ – ఓ ప్రత్యేక అనుభవం

గోవా టూరిజం తగ్గిపోతోందా?.గోవా అంటే అదొక డిఫరెంట్ వైబ్.. అక్కడి బీచుల్లో చిల్లవటం చాలా కిక్ ఇచ్చే విషయం.. మన దేశం నుండే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల నుండి ఏటా లక్షలాది టూరిస్టులు వస్తుంటారు. మన దగ్గర నలుగురు కుర్రాళ్లు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే అందులో గోవా ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుంది. ఒక్కసారి కాదు, ప్రతి ఏటా అనేకసార్లు గోవా వెళ్లే వాళ్లు ఎంతోమంది ఉంటారు.

Advertisements

గోవా టూరిజం తగ్గిపోతోందా?

కానీ, ఇదంతా నిన్నటి పరిస్థితి. ఇప్పుడు సీన్ మారింది. గోవా వెళ్లే టూరిస్టులు తగ్గిపోతున్నారు. గోవా అంటే చాలా మంది పెదవి విరుస్తున్నారు. గోవా టూరిజం దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా విదేశీ టూరిస్టులు బాగా తగ్గిపోయారు. 2019లో 85 లక్షల మంది విదేశీ టూరిస్టులు గోవా వెళ్తే, 2023లో ఆ సంఖ్య 15 లక్షలకు పడిపోయింది. 2024లో 4 లక్షల 60 వేల మంది ఫారినర్స్ మాత్రమే వచ్చారు.

కోవిడ్ ప్రభావం – టూరిజం మళ్లీ ఎందుకు నిలదొక్కుకోలేదు?

కోవిడ్ తర్వాత ప్రపంచంలోని చాలా టూరిస్ట్ డెస్టినేషన్స్‌లో టూరిస్టుల సంఖ్య మళ్లీ యథాతథ స్థితికి చేరింది. కానీ, గోవా విషయంలో మాత్రం ఇది జరగలేదు. దీనికి కారణాలేంటి? గోవా అంటే విముఖత ఎందుకు పెరుగుతోంది?

బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ కారణాలు చూసే ముందు, రీసెంట్‌గా అక్కడి బీజేపీ ఎమ్మెల్యే ఒకాయన ఏమన్నారో చూద్దాం. “గోవా బీచ్‌లో ఇడ్లీ, సాంబార్, వడపావ్ అమ్మకాల వల్లే విదేశీయులు రావడం లేదు… బెంగుళూరు నుండి వచ్చిన వాళ్లు, గోవా బీచ్‌లో ఇడ్లీ, సాంబార్, వడాపావ్ అమ్ముతున్నారని అందుకే రెండేళ్లుగా ఫారిన్ టూరిస్టులు తగ్గిపోయారు” అని ఆయన వ్యాఖ్యానించారు.గోవా టూరిజం పడిపోయిందా.

ఇడ్లీ, సాంబార్ వల్ల టూరిస్టులు రారా? అసలు సమస్య ఏంటి?

గోవాకి ఇడ్లీ సాంబార్‌కు ఏంటి సంబంధం? ఇడ్లీ సాంబార్ అమ్మితే టూరిస్టులు రారా? అసలు సమస్యేంటో అర్థం చేసుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంతవరకు సమంజసం? ఇడ్లీ సాంబారా, రోటీనా, బ్రెడ్ ఆమ్లెట్నా, వడాపావా, చికెన్ టిక్కానా, బిర్యానీనా అనే తేడా విదేశీ టూరిస్టులకు ఉంటుందా?

టూరిస్టులకు ప్రధానంగా అవసరమైన సౌకర్యాలు

టూరిస్టులు ఒక డెస్టినేషన్‌ను ఎంపిక చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను పరిశీలిస్తారు.

ఇవన్నీ కీలక అంశాలుగా మారతాయి.

సోషల్ మీడియాలో గోవా టూరిజంపై ప్రతికూల ప్రభావం

ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఏదైనా డెస్టినేషన్‌ను సెలెక్ట్ చేసుకునే ముందు టూరిస్టులు ఆన్‌లైన్ రివ్యూలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో టూరిస్టులు తమ అనుభవాలను షేర్ చేస్తున్నారు. గోవా వెళ్లిన వాళ్లకు ఎదురవుతున్న సమస్యలు ప్రపంచానికి అర్థమవుతున్నాయి. అందుకే టూరిస్టులు గోవాకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటున్నారు.

గోవా టూరిజం క్షీణతకు ప్రధాన కారణాలు

  1. భద్రత సమస్యలు – టూరిస్టులు తాము వెళ్లే ప్రదేశంలో సేఫ్టీ ఉండాలని ఆశిస్తారు.
  2. అధిక ఖర్చులు – గోవాలో హోటళ్లు, ట్రాన్స్‌పోర్టేషన్, ఫుడ్ ధరలు పెరిగాయి.
  3. టాక్సీ మాఫియా ప్రభావం – టూరిస్టులను మోసం చేయడం, అధిక చార్జీలు వేయడం వల్ల టూరిస్టులకు అసౌకర్యంగా మారింది.
  4. సర్వీసెస్ లోకల్ పోటీ లేకపోవడం – గోవాలో ఇంకా ఓలా, ఉబర్ వంటి రైడ్ హైలింగ్ యాప్స్ అందుబాటులో లేవు.

టాక్సీ మాఫియా – గోవాకు పెద్ద సమస్య
టూరిస్టుల్ని టాక్సీ డ్రైవర్లు వేధించడం, అధిక చార్జీలు వసూలు చేయడం వల్ల పర్యాటకులు ఇతర గమ్యస్థానాలను వెతుకుతున్నారు. విదేశీ టూరిస్టులు ఈ సమస్యలపై తరచుగా సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు.

పరస్పర పోటీ పెరిగిన టూరిజం రంగం
ప్రతి రంగంలో పోటీ పెరిగినట్టే టూరిజంలో కూడా పెరిగింది. పోటీలో నిలబడాలంటే మెరుగైన సర్వీసులు అందించాలి. ఒక డెస్టినేషన్‌కు వెళ్లేటప్పుడు అక్కడి పరిస్థితులను ముందే తెలుసుకుంటున్నారు. గోవాలో సరైన వసతులు లేకపోతే, టూరిస్టులు తప్పుకోవడం సహజం.

విదేశీ టూరిస్టులు గోవా బదులు వేరే దేశాల వైపు చూస్తున్నారు
గోవా వచ్చే విదేశీ టూరిస్టుల్లో ఎక్కువగా రష్యా, యూకె, ఇజ్రాయెల్ దేశాలవారు ఉంటారు. కానీ ఇప్పుడు శ్రీలంక, థాయ్‌లాండ్, మలేసియా, వియత్నాం వైపు టూరిస్టులు వెళ్లిపోతున్నారు. అక్కడ భద్రత, ఖర్చు తక్కువగా ఉండటంతో టూరిస్టులకు అవి మెరుగైన ప్రత్యామ్నాయాలుగా మారాయి.

ఫామిలీ టూరిజం – గోవా బదులు బ్యాంకాక్
ఇటీవల బ్యాంకాక్‌ను ఫ్యామిలీ టూరిజానికి కూడా ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటున్నారు. బ్యాంకాక్‌లో ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా, సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి.

గోవా టూరిజాన్ని గాడిలో పెట్టేందుకు ఏం చేయాలి?

గోవా టూరిజం తిరిగి బలపడగలదా?
గోవాలో టూరిస్టుల అనుభవాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో, టూరిస్ట్ ఫ్రెండ్లీ డెస్టినేషన్ అనే పేరును కోల్పోయింది. ఇది తిరిగి రావాలంటే టూరిజానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి. పోటీలో నిలబడాలంటే, మెరుగైన సౌకర్యాలు అందించాలి. ఇప్పుడు మారకపోతే, గోవా టూరిజం మరింత వెనుకబడే ప్రమాదం ఉంది.

Related Posts
హోళీ అంటే అర్థం ఏమిటి? ..ఎందుకు చేసుకుంటోరో తెలుసా..?
What does Holi mean? ..Do you know why it is celebrated..?

హైదరాబాద్‌: హోళీ అంటే సర్వం రంగుల మయం. చిన్నపెద్దా అందరిలో ఆనందం. ఉత్సాహంగా… ఉల్లాసంగా.. చిన్నపెద్దా, కులం, పేద, ధనిక ఇలా ఏ బేధం లేకుండా ఆనందోత్సవాలతో Read more

Gunde Ninda Gudi Gantalu:Today మార్చి 14 ఎపిసోడ్ బాలు కన్నీటి సీన్- హృదయాన్ని కదిలించే ఘట్టం.don’t miss it
Gunde Ninda Gudi Gantalu: Today మార్చి 14 ఎపిసోడ్ బాలు కన్నీటి సీన్- హృదయాన్ని కదిలించే ఘట్టం.don't miss it

పాపం బాలు.. తండ్రికి చెల్లెలి ఫంక్షన్ డబ్బులన్నీ అప్పజెప్పి, మరుసటి రోజే సంబరాల్లో మునిగిపోతాడు. ‘నాన్నా త్వరగా నిద్రపోండి.. ఉదయానికే పనులున్నాయి..’ అని ఆనందంగా చెబుతాడు. అదే Read more

Ugadi : ఉగాది పచ్చడి రుచులలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు !
The health secrets hidden in the flavors of ugadi pachadi !

Ugadi : కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ, ఆధ్యాత్మికతను పెంపొందించుకునే పండుగ ఉగాది. ఈ పండుగ రోజు చేసుకునే ఉగాది పచ్చడి షడ్రుచులతో కూడి ఆరోగ్యానికి మేలు Read more

×