Gunde Ninda Gudi Gantalu: Today మార్చి 14 ఎపిసోడ్ బాలు కన్నీటి సీన్- హృదయాన్ని కదిలించే ఘట్టం.don't miss it

Gunde Ninda Gudi Gantalu:Today మార్చి 14 ఎపిసోడ్ బాలు కన్నీటి సీన్- హృదయాన్ని కదిలించే ఘట్టం.don’t miss it

పాపం బాలు.. తండ్రికి చెల్లెలి ఫంక్షన్ డబ్బులన్నీ అప్పజెప్పి, మరుసటి రోజే సంబరాల్లో మునిగిపోతాడు. ‘నాన్నా త్వరగా నిద్రపోండి.. ఉదయానికే పనులున్నాయి..’ అని ఆనందంగా చెబుతాడు. అదే క్షణంలో, మీనా అతని చేతిపై గాయం గమనించి ఆందోళన చెందుతుంది. ‘చిన్నదే మీనా.. జరగబోయేది ఎవరి ఫంక్షన్? నా చెల్లెలిది.. తన కోసం ఏ లోటూ ఉండకూడదు.. అందుకే కాస్త కష్టపడ్డా.. కానీ ఈ వేడుక జీవితాంతం గుర్తుండిపోతుంది’ అని అమాయకంగా చెప్పుకొస్తాడు.

Advertisements

సత్యం చిత్తవేదన చెందుతాడు.. ‘ఈ వేడుకలో మాతో ఉండలేవు అని ఎలా చెప్పాలి?’ అని మనసులోనే మథనపడతాడు. అర్థరాత్రి అయినా, అతనికి బాలుతో మాట్లాడే తలంపు రాదు. ఈలోగా ప్రభావతి మాత్రం సత్యాన్ని ప్రశ్నిస్తూ, ‘నువ్వు చెప్పాల్సింది చెప్పలేదే’ అని విభేదిస్తుంది. సత్యం మాత్రం అసహాయంగా ‘ఎలా చెప్పగలను?’ అని బాధపడతూనే సమాధానం ఇస్తాడు.

తర్వాతి రోజు:

మీనా పనుల్లో నిమగ్నమై ఉండగా, మనోజ్, రవి, శ్రుతి, రోహిణీ అందరూ రెడీ అవుతారు. బాలు కూడా పంచెకట్టుకుని వేడుకకు సిద్ధమవుతాడు. ‘ మీనా.. నువ్వు సిద్ధంగా ఉండాల్సింది.. పనులన్నీ నీపై పెట్టుకున్నావ్! అంటూ చిన్నగా చిరునవ్వు విసురుతాడు. ఆ సమయంలో, మౌనిక కోసం తెప్పించిన పుస్తెల తాడు రావడం ఆలస్యం అవ్వడంతో, బాలు రాజేష్‌కి కాల్ చేసి ‘సమయానికి తాడు ఇంట్లో ఉండాలి’ అని అలర్ట్ చేస్తాడు.

అప్పటికే హాల్లో చేరుకున్న సత్యం, ప్రభావతి బాలుతో ముఖాముఖి మాట్లాడతారు.
‘కాకినాడ దగ్గర ఒక గుడి ఉంది. నువ్వు అక్కడికి వెళ్లి ప్రత్యేక పూజ చేయాలి..’ అని ప్రభావతి సూచిస్తుంది.
బాలు ఆశ్చర్యపోతూ, ‘ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని పూజలేంటీ? నేను ఎక్కడికీ వెళ్లను.. ఇక్కడే ఉంటా’ అని తండ్రిని పట్టుకుని కూర్చుంటాడు.

అప్పుడే ప్రభావతి నిజాన్ని బయటపెడుతుంది.
‘వాళ్లు నిన్ను ఈ వేడుకలో ఉండొద్దని స్పష్టంగా చెప్పారు..’

ఆ మాట వినగానే బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు.
అంతా నిశ్చలంగా చూస్తూ ఉండగా, మనోజ్ మాత్రం లోపలపలగా సంతోషించేస్తాడు.
‘నా కూతురు ఫంక్షన్ ఏ వివాదం లేకుండా జరగాలి..’ అని ప్రభావతి తన నిర్ణయాన్ని సమర్థించుకుంటుంది.

అయితే, మీనా ఊరుకోదు.
‘మౌనిక ఫంక్షన్ కోసం ఇంత కష్టపడ్డ మీ కొడుకు ఇప్పుడు అవసరమే లేకుండా పోయాడా?’ అని ప్రశ్నిస్తుంది.

Gunde Ninda Gudi Gantalu: Today మార్చి 14 ఎపిసోడ్ బాలు కన్నీటి సీన్- హృదయాన్ని కదిలించే ఘట్టం.don't miss it

తీవ్ర వాదన:

ప్రభావతి కూడా కోపంగా, ‘వాళ్లు బాలుని కోరుకోవడం లేదు..’ అంటూ సత్యాన్ని ఇరికిస్తుంది.
సత్యం అల్లాడిపోతూ నిశ్శబ్దంగా ఉంటాడు.
బాలు తండ్రిని చూస్తూ, ‘నువ్వు ఉండొద్దురా అంటే బయటికి వెళ్లిపోయి ఏ చెట్టు కిందో కూర్చుంటా.. కానీ ఇక్కడ ఉండలేను’ అని భావోద్వేగంగా చెబుతాడు.
‘నేను వెళ్లిపోతాను..’ అని తేల్చేస్తాడు.

ఈ సమయంలో, బాలును ఆపేందుకు సత్యం ప్రయత్నించవచ్చేమో!
అయితే, ఇదంతా చూస్తున్న సంజూ.. తన వ్యూహం విజయవంతం కానుందనే తృప్తిలో ఉంటాడు.
మౌనిక పుట్టింటిని శాశ్వతంగా దూరం చేసేందుకు అతని స్కెచ్ సక్సెస్ అవుతుందా?
అదే సమయంలో, శ్రుతి గురించి కూడా అతనికి ఒక పథకం ఉందా?

ఇంతకీ, ఈ ఫంక్షన్ మధ్యలో సంజూ నిజస్వరూపం బయటపడుతుందా?
తదుపరి భాగంలో ఆసక్తికరమైన మలుపులు!

Related Posts
హోళీ అంటే అర్థం ఏమిటి? ..ఎందుకు చేసుకుంటోరో తెలుసా..?
What does Holi mean? ..Do you know why it is celebrated..?

హైదరాబాద్‌: హోళీ అంటే సర్వం రంగుల మయం. చిన్నపెద్దా అందరిలో ఆనందం. ఉత్సాహంగా… ఉల్లాసంగా.. చిన్నపెద్దా, కులం, పేద, ధనిక ఇలా ఏ బేధం లేకుండా ఆనందోత్సవాలతో Read more

Bramhamudi- Nainisha: ప్రేమలో పడిన బ్రహ్మముడి అప్పు.. ఎవరితో తెలుసా
Bramhamudi- Nainisha: ప్రేమలో పడిన బ్రహ్మముడి అప్పు.. ఎవరితో తెలుసా

నైనిషా రాయ్ ప్రేమ వార్తతో అభిమానులకు సర్‌ప్రైజ్: అప్పుగా కనిపించిన ఆ భామ ప్రేమలో కూరుకుపోయిందిగా! తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నైనిషా రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన Read more

Miss World Festival : చేనేత చీరలో మెరవనున్న అందగత్తెలు
Beautiful ladies shining in handloom sarees

Miss World Festival : హైదరాబాద్ నగరంలో మే 15వతేదీన జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పోచంపల్లి చీరలు మెరవనున్నాయి. తెలంగాణ చేనేత వారసత్వం, సాంస్కృతిక గొప్పతనాన్ని Read more

గోవా టూరిజం తగ్గిపోతోందా?
గోవా టూరిజం తగ్గిపోతోందా?

గోవా వైబ్ – ఓ ప్రత్యేక అనుభవం గోవా టూరిజం తగ్గిపోతోందా?.గోవా అంటే అదొక డిఫరెంట్ వైబ్.. అక్కడి బీచుల్లో చిల్లవటం చాలా కిక్ ఇచ్చే విషయం.. Read more

Advertisements
×