harish rao comments on cm revanth reddy

Harish Rao: మన సీఎం కూడా మంచి వక్త…కళాకారుడు అధ్యక్షా : హ‌రీశ్‌రావు

Harish Rao : శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన మోసాల‌ను ఎండ‌గ‌ట్టారు. మన ముఖ్యమంత్రి గారు కూడా మంచి వక్త, మంచి కళాకారుడు అధ్యక్షా… ఎన్నికల ముందు పల్లె పల్లెనా తిరుగుతూ ఎంతో నాటకీయంగా, డ్ర‌మ‌టిక్‌గా వారు చెప్పిన డైలాగులు ఒక్కసారి మళ్లీ గుర్తు చేస్తున్నాఅన్నారు. ఆరు గ్యారెంటీలు ఆవిరైపోయాయి. కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందుకుంటూ ప్రజా జీవితం చక్కగ సాగుతున్న సందర్భం. స్వర్గాన్ని కిందకు దించుతామనే రీతిలో వీళ్లు హామీలు ఇచ్చిన్రు.

Advertisements
మన సీఎం కూడా మంచి

మహాలక్ష్మి ఊసే ఎత్తలేదు

ఆరు గ్యారెంటీల పేరుతో బాండు పేపర్లు ముద్రించి ఆశలు రేపిన్రు. ఆరు గ్యారెంటీల్లో ప్రధానమైన అంశాల మీద ప్రస్తావన లేదు, ప్రతిపాదన లేదు. దాదాపుగా చేతులెత్తేసారు. ఆరు గ్యారెంటీల్లో మొదటి హామి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా 2500 మహాలక్ష్మి ఊసే ఎత్తలేదు. మాట కూడా ఎత్తని మరో హామి, 4వేల పింఛన్. ముసలివాళ్లు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, గీతన్నలు తదితర 44 లక్షలనిరుపేద ఆశల్ని ఈ బడ్జెట్ అడియాశలు చేసింది అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

ఈ రాష్ట్రంలో 44 లక్షల మంది ఆసరా పించన్‌

వచ్చే నెలా డిసెంబర్ 9 నాడు, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. రెండు వేలు కాదు, నాలుగు వేల పించన్ వస్తది అన్నడు. ఇంకేం అన్నడు మనువడు వచ్చి కాళ్లు ఒత్తుతడు, పెట్రోల్ కు ఐదు వందలో, వెయ్యో అడుక్కుంటడు అవ్వా అన్నడు. ఈ రాష్ట్రంలో 44 లక్షల మంది ఆసరా పించన్‌దారుల చెవుల్లో ఈ మాటలు ఇంకా గింగురుమంటున్నయి. మనవడు కాళ్లొత్తడం లేదు గానీ, అవ్వా తాతలు కన్నీళ్లు ఒత్తుకొంటున్నరు. పింఛన్ 4 వేలు ఎప్పుడైతదా.. అని ఎదురుచూస్తూనే కొందరు కాలం చేసిన్రు. తీరా జరుగుతున్నదేమిటి? ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదు అన్నాడు.

Related Posts
జాతిపిత మహాత్మ గాంధీకి వర్దంతి సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ నివాళి
damodharragandhivardanthi

జాతిపిత మహాత్మగాంధీకి, ఆయన వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు.. మహాత్ముడు చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను అందరూ Read more

శివరాత్రికి ఉచితంగా అల్పాహారం :మంత్రి సురేఖ
భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సురేఖ !

శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు మంత్రి కొండా సురేఖ మంచి శుభవార్త చెప్పారు. ప్రముఖ ఆలయాల్లో ఉపవాసం ఉండే భక్తులకు పండ్లు, అల్పాహారం ఉచితంగా అందించనున్నట్లు Read more

ట్రూడో రాజీనామాకు డెడ్‌లైన్‌..సొంత పార్టీ ఎంపీల డిమాండ్‌
Deadline for Trudeau resign

ఒట్టావా : కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో పై సొంతపార్టీ భగ్గుమంది. ఆయన రాజీనామా చేయాలని 24 మంది లిబరల్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. అక్టోబరు 28లోపు Read more

‘బాబు – షర్మిల’ ల ముసుగు తొలిగిపోయింది అంటూ వైసీపీ ట్వీట్
babu sharmila

జగన్, షర్మిలకు నెలకొన్న ఆస్తి వివాదంపై టీడీపీ ట్వీట్ చేయడంపై వైసీపీ స్పందించింది. 'ముసుగు తొలగిపోయింది. పక్క పార్టీ నేతల వ్యక్తిగత విషయాలను టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×