ప్రపంచంలోని విలువైన వజ్రాలలో ఒకటిగా పేరు పొందిన గోల్కొండ నీలి వజ్రం మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది స్వాతంత్య్రానికి పూర్వం భారత రాజవంశాల ఆధీనంలో ఉన్న అరుదైన ఆభరణం. ఇప్పుడది మొట్టమొదటిసారి వేలానికి రానుంది .

గోల్కొండ నీలి వజ్రం
ఈ నీలి వజ్రం మొదట ఇండోర్ మహారాజు యశ్వంత్ రావు హోల్కర్ ఆధీనంలోకి వచ్చింది. ఆయన తండ్రి ఈ వజ్రాన్ని 1923లో ఒక ఫ్రెంచ్ వ్యాపారి వద్ద నుంచి కొనుగోలు చేశారు. వజ్రం అప్పట్లో బ్రేస్‌లెట్‌లో ఉండేది. ఆ తర్వాత దీన్ని ప్రఖ్యాత న్యూయార్క్ జువెలర్ హ్యారీ విన్‌స్టన్ కొన్నారు. అంచెలంచెలుగా ఇది బరోడా రాజవంశానికి చేరింది. కాలక్రమేణా ప్రైవేట్ కలెక్షన్లలోకి వెళ్లిపోయిన ఈ వజ్రం, దశాబ్దాల తర్వాత మళ్లీ వేలంలోకి వస్తుండడం విశేషం.
అంచనాలను దాటి విలువ
ఈ వజ్రం 23-24 క్యారెట్ల బరువు కలిగిన నీలి వర్ణపు వజ్రంగా గుర్తించబడింది. ఇది ఒక బంగారు ఉంగరంలో పొదిగబడిన రూపంలో ఉంది. అత్యంత అరుదైన ఈ రత్నానికి రూ. 300 కోట్ల నుండి రూ. 430 కోట్ల వరకు ధర పలకవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. జెనీవాలో మే 14న జరగబోయే క్రిస్టీస్ ‘మెగ్నిఫిసెంట్ జువెల్స్’ వేలంలో ఈ వజ్రం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ వేలాన్ని నిర్వహిస్తున్న క్రిస్టీస్ సంస్థ అంతర్జాతీయ ఆభరణాల విభాగాధిపతి రాహుల్ కడాకియా ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి అరుదైన వజ్రం జీవితంలో ఒక్కసారి మాత్రమే వేలానికి రావచ్చు. గోల్కొండ వజ్రాలను వేలం వేసే అవకాశం 259 ఏళ్ల చరిత్రలో అరుదైన సందర్భం. ప్రస్తుత తెలంగాణలో గోల్కొండ గనులలో లభించిన ఈ నీలి వజ్రం 1920-1930 దశకాలలో ఇండోర్ మహరాజుగా ఉన్న యశ్వంత్ రావు హోల్కర్ వద్దకు చేరింది. 1923లో మహరాజు తండ్రి ఓ ఫ్రెంచ్ వ్యాపారి నుంచి బ్రేస్‌లెట్‌లో పొదిగిన ఈ నీలి వజ్రాన్ని కొనుగోలు చేశారు. అనంతరం 1947లో దీన్ని న్యూయార్క్ జువెలర్ హ్యారీ విన్‌స్టన్ కొనుగోలు చేశారు. అక్కడి నుంచి అది మళ్లీ బరోడా మహరాజు వద్దకు చేరింది. ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిన గోల్కొండ నీలి వజ్రం మళ్లీ ఇన్నాళ్లకు వేలానికి వస్తోంది. ఇది వేలంలో ఎంత ధర పలికినా, దాని చరిత్ర విలువకు సమానంగా ఉండదు.
Read also: Narendra Modi: అభిమానికి షూ తొడిగిన ప్రధాని