BJP : హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్.గౌతం రావు పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్ పదవీకాలం మే 1తో ముగియనుంది. దీంతో కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనుంది.

నేటితో నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు మార్చి 24న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నేటితో (శుక్రవారం) నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. దీంతో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతం రావు పేరును ఖరారు చేసింది హైకమాండ్. మరికాసేపట్లో గౌతం రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు
ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగనుండగా.. ఏప్రిల్ 9 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇక ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 25న నిర్వహించి, ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమలులోకి వచ్చింది.