బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన 60వ బర్త్‌డే సందర్భంగా ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. మీడియాతో మాట్లాడుతూ, తాను గౌరీ స్ప్రత్ అనే మహిళతో డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గత సంవత్సరం నుంచి ఆమెతో ప్రేమలో ఉన్నట్లు తెలిపారు. ఇది తెలిసిన వెంటనే నెటిజన్లు గౌరీ స్ప్రత్ గురించి ఇంటర్నెట్‌లో తెగ వెతికారు.

గౌరీ స్ప్రత్ బెంగుళూరుకు చెందిన మహిళ, ఆమె గత 25 ఏళ్లుగా ఆమిర్‌తో స్నేహబంధం కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. గౌరీ ప్రస్తుతం ఆమిర్ ప్రొడక్షన్ బ్యానర్‌లో పని చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా సమాచారం బయటకు రాలేదు. కొంతమంది వార్తా మాధ్యమాల ప్రకారం, గౌరీకి ఒక ఆరేళ్ల కుమార్తె ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ జంట మళ్లీ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా గౌరీ స్ప్రత్, తన రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌరీ నాకు దయగల వ్యక్తి, మంచి మనసున్న జెంటిల్‌మన్, నా పట్ల శ్రద్ధగల వ్యక్తి కావాలి అని పేర్కొంది. ఆ లక్షణాలన్నీ ఆమిర్‌లో కనిపించాయి కాబట్టే ఆయనను ప్రేమించినట్లు చెప్పింది.
గతంలో కూడా డేటింగ్ రూమర్లు
ఆమిర్ ఖాన్ కూడా గౌరీ గురించి మాట్లాడుతూ, నేను ప్రశాంతంగా ఉండగలిగే, నన్ను సమర్థంగా అర్థం చేసుకునే వ్యక్తి కోసం వెతికాను. ఆ వ్యక్తి గౌరీ అని అనిపించింది అని చెప్పారు. ఇది ప్రేమ కంటే ఆత్మీయ అనుబంధం అని ఆయన అన్నారు. ఆమిర్ ఖాన్, తన రెండో భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత, గౌరీ స్ప్రత్ గురించి పుకార్లు వచ్చాయి. కానీ అప్పుడు ఏదీ అధికారికంగా రుజువు కాలేదు. అయితే ఇప్పుడు, స్వయంగా ఆమిర్ ఖాన్ తన ప్రేమాయణాన్ని అంగీకరించడం బీటౌన్‌లో హాట్ టాపిక్ అయింది.