Fried Idli Recipe : ఫ్రైడ్ ఇడ్లీ తయారు చేసే విధానం

Read Time:  1 min
Fried Idli Recipe in Telugu
Fried Idli Recipe in Telugu
FONT SIZE
GET APP

పాత ఇడ్లీలు వృథా కాదు

ఒక రోజు ఉదయం ఇంట్లో నిన్నటి ఇడ్లీలు మిగిలిపోయాయి. అమ్మ వాటిని తీసుకొని పొడవాటి ముక్కలుగా కట్ చేసింది ఆ తరువాత
పాన్‌లో నూనె వేసి, ఆ ఇడ్లీ ముక్కలు వేయించి పక్కన పెట్టింది. తరువాత పల్లీలు, శనగపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేపి పొడి చేసింది.
తర్వాత అమ్మ అన్నది – “పాత ఇడ్లీలు వృథా కాదు బంగారంఇప్పుడు ఈ కొత్త రుచి చూసి చెప్పు అంది!” నేను తిన్నాను… అద్భుతంగా ఉంది!
ఆ రోజు తర్వాత ఎప్పుడైనా ఇడ్లీ మిగిలినా… “అమ్మో! ఫ్రైడ్ఇడ్లీ చేయమ్మా!” అని నేనే అడిగే వాడిని.

Fried Idli Recipe in Telugu

కావలసిన పదార్థాలు:

  • ఇడ్లీలు – 4 (పాతవైనా ఉపయోగించవచ్చు)
  • పల్లీలు – 1 టేబుల్ స్పూన్
  • శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
  • మినపప్పు – 1 టేబుల్ స్పూన్
  • బియ్యం – 1 టేబుల్ స్పూన్
  • ధనియాలు – 1 టేబుల్ స్పూన్
  • మిరియాలు – 1 టీస్పూన్
  • ఎండుమిర్చి – 4
  • కరివేపాకు – 2 రెబ్బలు
  • ఉప్పు – తగినంత
  • నూనె – వేయించడానికి సరిపడా
  • చాట్ మసాలా – 1/4 టీస్పూన్

తయారు చేసే విధానం:

ముందుగా ఇడ్లీలను(Fried Idli Recipe) పొడవాటి ముక్కలుగా కట్ చేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోయాలి.
నూనె బాగా వేడయ్యాక ఇడ్లీ ముక్కలను వేసి రంగు మారే వరకు క్రిస్పీగా వేయించాలి. మరో పాన్ లో పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, బియ్యం, ధనియాలు, మిరియాలు, కరివేపాకు(curry leaves) వేసి తక్కువ మంట మీద వేయించాలి.అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి తగినంత ఉప్పు కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేయించిన ఇడ్లీ ముక్కలను వేసి, పైనుంచి పప్పుల పొడి & చాట్ మసాలా చల్లి బాగా కలిపితే,ఫ్రైడ్ ఇడ్లీ రెడీ!

Fried Idli Recipe
Fried Idli Recipe
Fried Idli Recipe

Read Hindi News: hindi.vaartha.com

Read Also: sajjala payasam recipe: సజ్జల పాయసం త‌యారీ విధానం

Digital

రచయిత గురించి

Digital

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.