EX MLA Shakeel : పోలీసుల అదుపులో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌

Read Time:  1 min
Former Bodhan MLA Shakeel in police custody
Former Bodhan MLA Shakeel in police custody
FONT SIZE
GET APP

EX MLA Shakeel: బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన షకీల్‌ ను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షకీల్‌ తల్లి బుధవారం కన్నుమూశారు. గురువారం అచన్‌పల్లిలో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్‌కు కాగా.. అక్కడికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు.

పోలీసుల అదుపులో బోధన్‌ మాజీ

తల్లి అంత్యక్రియల తర్వాత షకీల్‌ను విచారించే అవకాశం

కాగా కొన్ని నెలలుగా షకీల్‌ దుబాయ్‌లోనే ఉంటున్నారు. ఆయనపై పోలీసులు గతంలో లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. తల్లి అంత్యక్రియల తర్వాత షకీల్‌ను విచారించే అవకాశముంది. షకీల్‌ కుమారుడు సాహిల్ గతంలో కారును వేగంగా నడుపుతూ ప్రజాభవన్‌ ఎదుట ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపైనా పోలీసులు కేసు నమోదు చేసి లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. కాగా, షకీల్‌ అమీర్‌ మహమ్మద్‌ గతంలో బీఆర్‌ఎస్‌ తరపున రెండుసార్లు బోధన్‌ ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆయనపై పోలీసులు గతంలో లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేశారు.

Read Also: పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు కవిత

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.