PSL 2025: పీఎస్‌ఎల్‌ క్రికెటర్లు బస చేసిన హోటల్‌లో అగ్ని ప్రమాదం

PSL 2025: పీఎస్‌ఎల్‌ క్రికెటర్లు బస చేసిన హోటల్‌లో అగ్ని ప్రమాదం

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పి ఎస్ఎల్ ) 2025 సీజన్‌ శుక్రవారం,ప్రారంభం అయ్యింది,అయితే, టోర్నీ ప్రారంభానికి ముందు ఇస్లామాబాద్‌లోని హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ పీఎస్‌ఎల్‌ జట్టు క్రికెటర్లతో పాటు సిబ్బంది ఈ హోటల్‌లోనే బస చేశారు. ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్‌లోని ఆరవ అంతస్తులో మంటలు చెలరేగాయని స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. పీఎస్‌ఎల్‌ క్రికెటర్లు, సిబ్బందిని రక్షించారు. మంటల్లో ఎవరూ గాయపడలేదని.వారిని అక్కడి నుండి మరో చోటుకి తరలించినట్లు పేర్కొన్నారు. సకాలంలో మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. సీఎస్‌ఎల్‌ సీఈవో సల్మాన్‌ నసీర్‌ మీడియాతో మాట్లాడుతూ మంటలు హోటల్‌లోకి ప్రవేశించలేదన్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. ఆరు ఫైర్‌ ఇంజిన్లు, 50 మంది సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. అరగంటలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు సీడీఏ అత్యవసర డైరెక్టర్ జాఫర్ ఇక్బాల్ పేర్కొన్నారు.

Advertisements

పీఎస్‌ఎల్‌ మ్యాచులు

2025 తొలి మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ లాహోర్ ఖలందర్స్‌తో రావల్పిండి క్రికెట్ స్టేడియంలో తలపడింది. ఐపీఎల్‌ నేపథ్యంలో పీఎస్‌ఎల్‌ తొలి మ్యాచ్‌ను గంట ఆలస్యంగా ప్రారంభించింది. ఐపీఎల్‌ నేపథ్యంలో రాత్రి 8 గంటలకు పీఎస్‌ఎల్‌ మ్యాచులు మొదలవుతాయని పీఎస్‌ఎల్‌ సీఈవో సల్మాన్‌ నసీర్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌ లీగ్‌లు మొదలైనప్పటి నుంచి ఒకే విండోలో తలపడడం ఇదే తొలిసారి. బిజీ క్యాలెండర్‌ నేపథ్యంలో ఏప్రిల్‌-మే విండోలో పీఎస్‌ఎల్‌ని షెడ్యూల్‌ చేయడం తప్ప మరో మార్గం లేదని నసీర్‌ పేర్కొన్నారు. ఇది మంచిది కాదని. అయితే, పీఎస్‌ఎల్‌ అభిమానులను ఆకర్షిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌ ఒకేసమయంలో కొనసాగుతుండడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఐపీఎల్‌ వేలంలో అమ్ముడవకుండా మిగిలిపోయిన కొందరు విదేశీ స్టార్స్‌ పీఎస్‌ఎల్‌ ఆడేందుకు ఒప్పందం చేసుకున్నారు. వచ్చే ఏడాది లీగ్‌లోకి మరో రెండు జట్ల చేర్చాలని భావిస్తున్నట్లు పీఎస్‌ఎల్‌ సీఈవో పేర్కొన్నారు.

వార్నర్ నాయకత్వం

హసన్, తన ఉత్సాహంతో పాటు జట్టుపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, ఈ సీజన్‌లో తమ ప్రదర్శన మళ్లీ చర్చకు వస్తుందని తెలిపాడు. నేషనల్ బ్యాంక్ స్టేడియంలో తమ ఆతిథ్యపు మ్యాచ్‌లు అభిమానులకు నిజమైన విజువల్ ట్రీట్‌గా ఉండబోతాయని హామీ ఇచ్చాడు.కరాచీ కింగ్స్ జట్టును పరిశీలిస్తే, వారు ఈసారి బలమైన యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. డేవిడ్ వార్నర్ నాయకత్వంలో, హసన్ అలీ, ఆడమ్ మిల్నే, అబ్బాస్ అఫ్రిది లాంటి గట్టి పేసర్లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌లో జేమ్స్ విన్స్, కేన్ విలియమ్సన్, లిట్టన్ దాస్ లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఈ సమతుల్యమైన స్నేహితులతో కింగ్స్ జట్టు ప్రతిసారీ గెలుపు కోసం పోరాడనుంది.

Read Also: Mohammad Rizwan:తన ఇంగ్లీష్ భాషపై ట్రోలింగ్ స్పందించిన పాకిస్థాన్ కెప్టెన్ రిజ్వాన్

Related Posts
ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధమే : జెలెన్‌స్కీ
ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధమే : జెలెన్‌స్కీ

కీవ్ : ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ ఇటీవల మీడియా ఎదుటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. ట్రంప్‌ తో భేటీ Read more

ఆటోను ఢీకొట్టిన లారీ, ఏడుగురు దుర్మరణం
ఆటోను ఢీకొట్టిన లారీ, ఏడుగురు దుర్మరణం

బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ఆరుగురు కూలీలు, డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. ఈ దుర్ఘటన రాష్ట్ర Read more

కుల గణన చిచ్చు..రేవంత్ సర్కార్ పై.. బీసీ సంఘాల ఫైర్!
కుల గణన చిచ్చు రేవంత్ సర్కార్ పై.. బీసీ సంఘాల ఫైర్!

2014లో జరిగిన సమగ్ర సర్వేలో OC (ఆప్తి కేటగిరీ) జనాభా 11% ఉండగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో ఆ సంఖ్య 15.79%కి పెరిగింది.ఇదే సమయంలో Read more

నాకు మంత్రి పదవి వస్తే వారికే లాభం – రాజగోపాల్ రెడ్డి
rajagopal

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు లాభమే కలుగుతుందని Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×