📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vijay Setupathi Maharaja 2 : విజయ్ సేతుపతి ‘మహారాజ 2’ అప్‌డేట్..!

Author Icon By Ramesh
Updated: September 19, 2026 • 10:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vijay Setupathi Maharaja 2 : సక్సెస్‌ఫుల్ హీరో విజయ్ సేతుపతి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మహారాజ’కు సీక్వెల్ రాబోతున్నట్లు స్పష్టత వచ్చింది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద అసాధారణ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఇచ్చిన భారీ విజయం తర్వాత దీనికి సీక్వెల్ (Vijay Setupathi Maharaja 2) ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also : 3 రోజులు బ్యాంకులు బంద్.. ఎస్‌బీఐ కీలక సూచనలు..!

స్ట్రాంగ్ నరేషన్ తనకు ఎంతగానో నచ్చిందని :

తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ సేతుపతి ‘మహారాజ 2’ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తనకు ‘మహారాజ 2’ కథను వినిపించారని, ఆ స్ట్రాంగ్ నరేషన్ తనకు ఎంతగానో నచ్చిందని ఆయన తెలిపారు. ఒరిజినల్ మూవీ మాదిరిగానే సీక్వెల్ కథ కూడా చాలా బలంగా, అద్భుతంగా వచ్చిందని ప్రశంసించారు. దీంతో గత కొంతకాలంగా సీక్వెల్‌పై జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది.

maharaja movie

ఇక ఇదే సమయంలో ఈ సినిమా హాలీవుడ్ రీమేక్ రైట్స్‌ను ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ దక్కించుకోవడం విశేషం. దీనిపై స్పందిస్తూ విజయ్ సేతుపతి సరదాగా ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. నిర్మాత సుధన్ సుందరం తనకు చెప్పిన ఈ సర్ప్రైజ్ చాలా ఆనందాన్నిచ్చిందని, ఒకవేళ హాలీవుడ్ రీమేక్‌లో తనకు అవకాశం ఇస్తే ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఉచితంగా నటిస్తానని చమత్కరించారు.

మొత్తానికి, ‘మహారాజ’ సినిమాతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్, ఇప్పుడు ‘మహారాజ 2’తో మరోసారి థియేటర్లలో మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Google News in Telugu Hollywood Latest News in Telugu Maharaja 2 Maharaja Sequel Nithilan Swaminathan Vijay Setupathi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.