Yellamma : దేవి కి జోడి దొరికిందోచ్ !!

Follow Us: Google News Daily Hunt
Yellamma : దేవి కి జోడి దొరికిందోచ్ !!
FONT SIZE
GET APP

Yellamma : ‘బలగం’ వంటి సంచలన విజయం తర్వాత దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎల్లమ్మ’. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండటంతో ప్రాజెక్ట్‌పై మొదటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రంలో డీఎస్పీకి జోడీగా నటించే కథానాయిక ఎంపిక పూర్తయినట్లు టాలీవుడ్‌ వర్గాలు వెల్లడించాయి. ‘8 వసంతాలు’, ‘రోమాంచకం’ వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించిన యువ నటి అనంతిక సనీల్ కుమార్ ఈ ఫీమేల్ లీడ్ రోల్ కోసం ఖరారైనట్లు సమాచారం.

Read Also : ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్ ‘418’ విడుదల వాయిదా

త్వరలోనే సెట్స్‌పైకి హీరోయిన్ సీన్లు – మేకర్స్ క్లారిటీ

ఈ రోల్ కోసం నిర్వహించిన ఫోటోషూట్, యాక్టింగ్ టెస్ట్‌లలో అనంతిక ప్రదర్శన పట్ల దర్శకుడు వేణుతో పాటు నిర్మాత దిల్ రాజు కూడా ఎంతో సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పల్లెటూరి నేపథ్యంతో పవర్‌ఫుల్ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్‌ పక్కన అనంతిక సరైన ఎంపిక అని భావించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, అతిత్వరలోనే హీరోయిన్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారు. ఈ కాంబినేషన్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్రబృందం త్వరలోనే విడుదల చేయనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు