Teja sajja: తేజ సజ్జా పెళ్లి.. సాఫ్ట్‌వేర్ ఇంజినీరే అమ్మాయి అంటూ!

Follow Us: Google News Daily Hunt
Teja sajja: తేజ సజ్జా పెళ్లి.. సాఫ్ట్‌వేర్ ఇంజినీరే అమ్మాయి అంటూ!
FONT SIZE
GET APP

Teja sajja: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా గురించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఆయనకు కాబోయే భార్య సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ ప్రచారంలో నిజమెంత?

Read also: Aadarsha Kutumbam: మరోసారి వాయిదా పడిన వెంకటేశ్‌  ‘ఆదర్శ కుటుంబం’..రిలీజ్‌ డేట్‌ మార్పు

డిసెంబర్‌లో తేజ సజ్జా పెళ్లి?

తేజ సజ్జా వివాహం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని పెళ్లి సంబంధాన్ని ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ప్రేమ వివాహం కాదని, పెద్దలు కుదిర్చిన వివాహమని, డిసెంబర్‌లో పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించినట్లు పలు వార్తలు వైరల్ గా మారాయి.

అయితే, ఈ విషయాలపై ఇటు తేజ సజ్జా నుంచి కానీ, ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. . దీంతో ఆయన పెళ్లి గురించి వస్తున్న వార్తలు ప్రస్తుతం పుకార్లుగానే అనిపిస్తుంది.

గతంలో పెళ్లి వార్తలపై తేజ ఏమన్నారంటే?

గత కొన్ని నెలల క్రితం ఓ జ్యువెలరీ ఈవెంట్‌లో పాల్గొన్న తేజ సజ్జాకు పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. త్వరలోనే ఆయన పెళ్లి జరగబోతోందని వార్తలు వస్తున్నాయని, అందుకే జ్యువెలరీ డిజైన్లు సిద్ధం చేస్తున్నారా? అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి తేజ సరదాగా స్పందిస్తూ, తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also

Keerthi

రచయిత గురించి

Keerthi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు