Varanasi : సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు భారీ విజువల్ ట్రీట్ లభించింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ నుంచి మేకర్స్ కీలక అప్‌డేట్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు పోషిస్తున్న ‘రుద్ర’ పాత్రకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్‌ను ముందుగా ఈ చిత్ర హాలీవుడ్ ప్రమోషన్ హెండల్ ఎక్స్ (X) వేదికగా పంచుకోగా, అనంతరం ‘వారణాసి’ మూవీ టీమ్ దానిని రీపోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో మహేష్ బాబు అత్యంత హ్యాండ్‌సమ్, పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు.
Read Also : వెంకటేశ్, సురేశ్ బాబు, రానాలకు హైకోర్టులో ఎదురుదెబ్బ
ఆఫ్రికా షెడ్యూల్ విశేషాలు: రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ ప్రత్యేక పిక్స్ విడుదలపై దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ దృశ్యాలు చిత్రానికి సంబంధించిన కీలకమైన ఆఫ్రికా షెడ్యూల్ డ్యూరింగ్‌లో చిత్రీకరించిన ఫ్రేమ్స్ అని ఆయన తెలిపారు. సినిమా విజువల్ క్వాలిటీ మరియు స్కేల్ ఎంత ఘనంగా ఉండబోతోందో వివరిస్తూ, సాధారణ IMAX ఫ్రేమ్ కూడా ఈ పిక్స్ అండ్ మేకింగ్ ముందు నిలబడలేదని వ్యాఖ్యానించడం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికెత్తింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ఈ బర్త్‌డే గిఫ్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :