Rajinikanth Biography: సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవితం ఆధారంగా త్వరలోనే బయోపిక్ రానుందా? అంటే ‘అవును’ అనే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
Read also: Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లో ట్విస్ట్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్?
తన జీవిత కథను స్వయంగా రాస్తున్న రజనీకాంత్
రజనీకాంత్ ప్రస్తుతం తన ఆత్మకథను (ఆటోబయోగ్రఫీ) స్వయంగా రాస్తున్నారని సౌందర్య ఓ తమిళ ఛానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బస్ కండక్టర్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం.. సినీ పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా ఎదిగిన తీరు.. కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలు వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ పుస్తకంలో ఉండనున్నట్లు ఆమె వెల్లడించారు.

బయోపిక్‌గా వస్తే… రిషికాంత్?
రజనీకాంత్ ఆత్మకథ విడుదలైన తర్వాత, దాని ఆధారంగా సినిమా లేదా వెబ్ సిరీస్‌గా తెరకెక్కించే అవకాశం ఉందని సౌందర్య పేర్కొన్నారు. ఈ క్రమంలో యంగ్ రజనీకాంత్ పాత్రకు నటుడు రిషికాంత్ సరిగ్గా సరిపోతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఆమె తెలిపారు. కాగా కండక్టర్ స్థాయి నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఆయన నటించిన ‘జైలర్-2’ చిత్రం అక్టోబర్ 15న విడుదల కానుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: Kannada Actor Ranya Rao : కన్నడ నటికి బిగ్ షాక్ ఇచ్చిన కస్టమ్స్ శాఖ