📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

People Star : ‘మంచి పాత్రలు వస్తే నటిస్తా’ అంటున్న నారాయణమూర్తి

Author Icon By Sudheer
Updated: October 28, 2026 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

People Star : సామాన్య ప్రజల జీవితాలు, సామాజిక సమస్యలు, కార్మికులు, రైతుల కష్టాలను తన సినిమాల ద్వారా తెరపై ఆవిష్కరించిన పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తాజాగా తన రూట్ మార్చినట్లు కనిపిస్తున్నారు. ఇప్పటివరకు విప్లవాత్మక, సామాజిక సందేశాత్మక చిత్రాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు ‘హుషారు-2’ సినిమాలో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా విడుదలైన టీజర్‌లో నారాయణమూర్తి కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఆయన చెప్పిన ‘తమ్ముళ్లూ.. వేట మొదలెడదమా’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఆయన కొత్త పాత్రలో ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Read ALso : రామాయణం పాటలపై ట్రోలింగ్.. స్పందించిన ఏఆర్ రెహమాన్!

సినిమాలు చేయాలనే ఉద్దేశంతోనే తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చానని, మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని ఆర్. నారాయణమూర్తి స్పష్టం చేశారు. గతంలో ‘టెంపర్’ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆయన ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ‘హుషారు-2’ వంటి కమర్షియల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనదైన అభినయంతో సామాజిక అంశాలను బలంగా చెప్పే నారాయణమూర్తి, ఈసారి భిన్నమైన పాత్రలో ప్రేక్షకులను ఎలా అలరిస్తారో చూడాలి. ఆయన ఎంపిక చేసుకునే పాత్రలు, కథల విషయంలో తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించనున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Husharu 2 Husharu 2 Teaser People Star r narayana murthy R Narayana Murthy New Movie Telugu cinema Telugu movie news Tollywood News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.