📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Singer Sunitha : నా వ్యాఖ్యలు తప్పుగా అర్ధం చేసుకున్నారు – సునీత

Author Icon By Sudheer
Updated: June 26, 2026 • 7:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Singer Sunitha : ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ప్రముఖ టాలీవుడ్ గాయని సునీత ఘాటుగా స్పందించారు. ‘నీ ఒళ్లు నీ ఇష్టమైతే.. వాడి కళ్లు వాడి ఇష్టం’ అంటూ తాను అన్న మాటలను కొందరు కావాలనే తప్పుగా అర్థం చేసుకుని వివాదం చేస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. తన మాటల వెనుక ఉన్న అసలు అర్థాన్ని వివరిస్తూ.. “నా శరీరం, నా ఇష్టం (My Body, My Wish) అంటే ఎవరి కంట్రోల్‌లోనూ ఉండకపోవడం, నా శరీరంపై నాకే పూర్తి హక్కు ఉందనేది ఒక కోణం. అయితే, మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామనే దానికి ప్రతీకగా.. ‘అతడి కళ్లు, అతడి ఇష్టం’ (His Eyes, His Wish) అనే భావజాలం ఉన్న సొసైటీలో మనం ఉన్నామనే చేదు నిజాన్ని మాత్రమే నేను ప్రస్తావించాను” అని సునీత స్పష్టం చేశారు.

Read Also : బాహుబలి 3 సినిమా పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్?

సగం చూసి విమర్శించొద్దు.. మొత్తం చూస్తే తెలుస్తుంది!

తన వ్యాఖ్యలను పూర్తిగా వినకుండా, కేవలం ఒక చిన్న ముక్కను మాత్రమే పట్టుకుని విమర్శలు చేయడం సరికాదని సునీత హితవు పలికారు. ఇంటర్వ్యూను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూస్తే తాను ఏ సందర్భంలో ఆ మాటలు అన్నానో అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఇదే క్రమంలో తనదైన శైలిలో హెచ్చరిస్తూ.. ఒకవేళ ఎవరైనా ‘నా చేతులు, నా ఇష్టం’ (My Hand, My Wish) అంటూ బౌండరీలు దాటి తప్పుగా ప్రవర్తించాలని చూస్తే, అలాంటి వారి చేతులు విరగ్గొడతామని తీవ్ర స్థాయిలో స్పష్టం చేశారు. మహిళల స్వేచ్ఛను, సమాజంలోని ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని ఆమె కోరారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Latest News in Telugu My Body My Wish Comments Singer Sunitha Sunitha Clarification Telugu News Tollywood Singer Sunitha Clarification Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.