📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

The Paradise movie: నాని ‘ది ప్యారడైజ్’ మూవీ స్పెషల్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు

Author Icon By Siva Prasad
Updated: August 24, 2026 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

The Paradise movie: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, కయాదు లోహర్ కథానాయికగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి యూట్యూబ్‌ను ఊపేస్తోంది. దీంతో ఈ సినిమా నుంచి రాబోయే తదుపరి పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also : Allari Naresh Ramba Oorvasi Menaka Teaser: అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ విడుదల

Release date confirmed for the special song from Nani’s movie ‘The Paradise’

The Paradise movie: పక్కా తెలంగాణ ఫోక్ మాస్ బీట్

ప్రస్తుతం ఫిలింనగర్ సమాచారం ప్రకారం ‘ది ప్యారడైజ్’ చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌గా ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ పాటలో నేచురల్ స్టార్ నానితో కలిసి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ స్టెప్పులేసినట్లు తెలుస్తోంది. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ కుదరడంతో ఈ పాటపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో ఈ మాస్ సాంగ్‌ను అధికారికంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

టెక్సాస్ కాన్సార్ట్‌లో అనిరుధ్ లైవ్ పర్ఫార్మెన్స్

ఈ చిత్రానికి సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ బాణీలు అందిస్తున్నారు. ఈ ఐటమ్ సాంగ్ కోసం ఆయన పక్కా తెలంగాణ ఫోక్ మాస్ బీట్‌ను కంపోజ్ చేసినట్లు సమాచారం. అమెరికాలోని టెక్సాస్‌లో త్వరలో జరగనున్న తన మ్యూజిక్ కాన్సార్ట్‌లో అనిరుధ్ ఈ పాటను నేరుగా లైవ్‌గా పర్ఫార్మ్ చేసి విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. అతిత్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Anirudh Ravichander Nani Keerthy Suresh song Latest News in Telugu Nani The Paradise Movie Update Srikanth Odela Nani movie Telugu movie news Telugu News The Paradise second single Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.