Mirzapur : ప్రముఖ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆధారంగా రూపొంది థియేటర్లలో విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘మీర్జాపూర్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 212 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. కేవలం భారతదేశంలోనే ఈ సినిమా రూ. 176.94 కోట్ల భారీ వసూళ్లను రాబట్టి బాలీవుడ్లో సరికొత్త ఊపును తెచ్చింది. క్రైమ్ మరియు యాక్షన్ డ్రామాను అమితంగా ఇష్టపడే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతుండటంతో వారం పూర్తయినప్పటికీ ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Read Also ; ‘సర్దార్ 2’ మూవీ రివ్యూ

కలిసొచ్చిన దివ్యేందు, పంకజ్ త్రిపాఠి క్రేజ్: వీకెండ్ ముగిసినా తగ్గని వసూళ్ల జోరు
పవర్ ఫుల్ కాన్సెప్ట్ మరియు నటీనటుల అత్యుత్తమ నటన ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ తమ నటనతో మళ్లీ ప్రేక్షకులను కట్టిపడేశారు. వారాంతం పూర్తయి వర్కింగ్ డేస్ ప్రారంభమైనప్పటికీ, గత ఒక్క రోజే ఈ చిత్రం భారత్‌లో రూ. 10.55 కోట్ల గ్రాస్ సాధించడం దీని రేంజ్‌ను తెలియజేస్తోంది. బలమైన ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా వీక్‌డేస్‌లో కూడా స్థిరమైన వసూళ్లతో ముందుకు సాగుతుండటంతో, రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని భారీ కలెక్షన్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :