📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Jagan Targets Chiranjeevi : జగన్ టార్గెట్ లో చిరంజీవి..?

Author Icon By Ramesh
Updated: July 6, 2026 • 10:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Jagan Targets Chiranjeevi : టైటిల్ చూసి ఇదేదో పొలిటికల్ న్యూస్ అని అంచనా వేసి ఉండొచ్చు. తానొక మెగాస్టార్ అయ్యుండి సినిమాలతో అశేష ప్రేక్షకాదరణ పొంది మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ప్రజాసేవ కోసం పార్టీ పెట్టి దాన్ని కొంతకాలానికే ముగించేసిన విషయం తెలిసిందే. అదంతా జరిగిపోయిన కథ. అయినా ఇప్పటికీ కొంతమంది చిరంజీవిని రాజకీయాల్లోకి లాగి ఇబ్బంది పెడుతుంటారు. దానికి మరో కారణం చిరు తమ్ముడు జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండటమే. అదలా ఉంచితే.. ఇక్కడ టైటిల్ లో ప్రస్తావించింది మాత్రం జగన్ టార్గెట్ చేసిన చిరంజీవి అంటే దర్శకుడు పూరీ జగన్నాథ్ టార్గెట్ లో మెగాస్టార్ అన్నమాట.

మెగా ఫ్యాన్ అయిన పూరీ జగన్నాథ్..

Read Also : రాజమౌళి ప్లానింగ్ తో బుచ్చి బాబు..?

మెగా ఫ్యాన్ అయిన పూరీ జగన్నాథ్ చిరుతో సినిమా చేయాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాడు. పూరీ వరుస సక్సెస్ లతో పీక్ టైం లో ఉన్నప్పుడు మెగా కాంబో సెట్ చేయాలని చూసినా అప్పుడు కుదరలేదు. ఐతే పూరీ మీద నమ్మకం ఉండబట్టే మెగా వారసుడు చరణ్ ని ఆయన దర్శకత్వంలో పరిచయం చేశారు.

పవర్ స్టార్ తో సూపర్ హిట్లు తీసినా..

ఐతే చరణ్ తో సక్సెస్ అందుకున్నా పవర్ స్టార్ తో సూపర్ హిట్లు తీసినా అల్లు అర్జున్ తో అదరగొట్టే సినిమాలు చేసినా కూడా మెగాస్టార్ నుంచి అవకాశం రాలేదు. చిరంజీవి కోసం పూరీ జగన్నాథ్ ఆటో జానీ అంటూ ఒక కథ రెడీ చేశారు. ఆ సినిమా ఇక పట్టాలెక్కడమే తరువాయి అనుకోగా మొదటి భాగం నచ్చింది కానీ రెండో భాగం బాగాలేదని చిరంజీవి చెప్పడంతో సినిమాకు ఫుల్ స్టాప్ పడింది.

అప్పటి నుంచి చిరు ఛాన్స్ కోసం పూరీ ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఐతే ఇప్పుడు అసలే పూరీ జగన్నాథ్ ఫామ లో లేడు. కానీ ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతితో చేస్తున్న స్లం డాగ్ తో మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకుంటాడని అంటున్నారు. ఒకవేళ అది హిట్ అయితే పూరీ నెక్స్ట్ టార్గెట్ నిజంగానే చిరంజీవి అవుతాడనడంలో సందేహం లేదు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Chiranjeevi Google News in Telugu Jagan Latest News in Telugu Megastar Chiranjeevi Puri Jagannath Telugu News Telugu News Today tollywood Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.