📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Jobs : వంటబట్టని ‘పట్ట’ భద్రత

Author Icon By Sudha
Updated: August 25, 2026 • 3:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Jobs : చదివిన చదువు ఒకటైతే చేసే ఉద్యోగం వేరు’ అను కుంటూ చాలా కాలంగా నిరుద్యోగులు సద్యోగులుగా మారి కాలం గడిపేసారు. సద్యోగమంటే మంచి ఉద్యో గం. ఏమాత్రం ఉపాధి లభించినా ఎలాగోలా బతికేస్తా రులే అని సరిపెట్టుకునే రోజులు పోయాయి. సాధారణ డిగ్రీలుగా పేరుపడిన బిఎ, బికాం, బిఎస్సీ కోర్సులు ప్రస్తుత పరిస్థితుల్లో కాలం చెల్లినవిగానే చెప్పుకోవాలి, అంతకన్నా మంచి విజ్ఞానం లభించే కోర్సులకు ప్రత్యేక రూపకల్పనంటూ ఏమీ లేదు. ఆర్ట్స్, సైన్స్ అని విడి విడిగా ఉండే ఆయా సబ్జెక్టులను అటు చేసి ఇటు చేసి కాంబినేషన్లు మార్చి కొత్త కోర్సుల రూపకల్పన జరుగు తోందే తప్ప మరో ప్రయత్నం కానరాదు. పనికి రావని ఉద్యోగ ప్రవేశాల సమయంలోనే తెలియవస్తోంది. ఆ తర్వాత మళ్లీ అనుబంధ కోర్సులు తప్పనిసరి. వాటిపై అవగాహన పెంచుకుంటేనే ఏదో ఓ ఉపాధి దొరుకు తుంది. లేదంటే అంతే, బతుకు బస్టాండ్లో వెళ్లదీయాల్సిందే. పూర్వం అయితే ‘సత్ర భోజనం మఠం నిద్ర’ అనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడాపరిస్థితి లేదు. కఠోర శ్రమ ద్వారా విద్యావంతులై ఆపై ఉన్నత ఉద్యోగాల్లోకి వెళ్లిన వారు లేకపోలేదు. అలాంటి వారు బహుతక్కువ. అందుకనే విద్యావిధానంలో కోర్సుల్లోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందంటుంటాం. కానీ అసలు సిసలు లోపమెక్కడుందో కనిపెట్టడానికి వేగిరం పూను కోలేం. సంస్కరణలు చేపట్టలేం. అదే జరిగితే ఉన్నత విద్యావంతులంతా ఉత్తమ ఉద్యోగ పీఠాలు ఎక్కేవారే. దానాదీనా ఇటీవల ‘నీతి అయోగ్’ వెల్లడి చేసిన రిపో ర్టులో ‘సాధారణ డిగ్రీలకు ఉపాధి దొరక్క ఉద్యోమూ దక్కదంటూ చేసిన వ్యాఖ్యానాలను బట్టి భారతీయ విద్యావిధానం డొల్లతనం అర్థమవుతోంది.

Read Also : East Coast Railway Apprentice Notification: ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1599 అప్రెంటిస్ పోస్టులు

Jobs

Jobs : అర్హతకు తగిన ఉపాధి దొరుకుతోంది

భారతదేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య యువత 8.7 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నా వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు ఏమీ పనిచేయకుండా ఖాళీగానే ఉన్నారని నీతి అయోగ్ స్పష్టం చేసింది. వికసిత్ భారత్ కోసం నైపు ణ్యాభివృద్ధి పునఃకల్పన 2047′ పేరిట నీతి ఆయోగ్ విడుదల చేసిన పుస్తకంలో ఎన్నో ఆసక్తికర అంశాలున్నా యి. 2021లో తన 78వ జాతీయ శాంపిల్ సర్వే ఆధా రంగా ఈ నివేదిక రూపుదిద్దుకుంది. దేశంలో 8.5శాతం మంది పట్టభద్రులకే వారి అర్హతకు తగిన ఉపాధి దొరు కుతోంది. మిగిలిన వారికి తగిన ప్రాక్టికల్ నైపుణ్యత లేక పోవడంతో ఉపాధి మృగ్యమౌతోంది. 2014-15 నుంచి ప్రస్తుతం వరకు 7.67 కోట్ల మందికే సరైన శిక్షణ లభిం చినట్లు తేటతెల్లం చేసింది. చాలా మంది తమకు ఆర్ధిక స్తోమతలేక సంప్రదాయ ‘డిగ్రీ కోర్సులు చదివాకతక్కువ వేతనాలకు చిన్నాచితకా ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని పోషించుకుంటూ లేక చదువుల లక్ష్యాన్ని మరచిపోతు న్నారు. అదీ గత్యంతరం లేక. ఇది నిజమేకావచ్చు. కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెందుగా ఉ న్నాయా? లేవా? అన్నది ప్రశ్న. యువత చదివిన చదువుల్లో పసలేదని వారి అత్తెసరు చదువులకు వాళ్లే బాధ్యులని చెప్పడమే అసలు బాగోలేదు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చు కున్న వారెవరూ వారి చదువులను పక్కన బెట్టడంలేదు.

ఉద్యోగవకాశాలు వరి మితంగా ఉన్నందున

భవిష్యత్తుకోసం ఆరాటపడుతూనే ఉన్నారు. కానీ వాళ్ల చదువులే వాళ్లకు శాపంగా ఉన్నాయనే ధోరణిలో నివేది కల విశ్లేషణలు సమంజసం కాదు. ప్రధానంగా విద్య నేర్చుకున్న వారందరికీ ఉపాధి లభించకపోవడానికి కార ణాన్ని ఆ నివేదికలో విశ్లేషిస్తూ కళాశాలల్లో బోధించే సిల బన్కు, పరిశ్రమల వాస్తవ అవసరాలకు మధ్య ఏమాత్రం పొంతన ఉండటం లేదన్నది నీతి ఆయోగ్ ఉవాచ. చాలా విద్యాసంస్థల్లో పాఠ్యప్రణాళికలు కాలం చెల్లినవిగా ఉండి నేటి పారిశ్రామికావసరాలకు తగినట్టుగా లేవన్నదినివేదిక సారాంశం. ఇదంతా ఇలా ఉంటే ఉద్యోగవకాశాలు వరి మితంగా ఉన్నందున కూడా నిరుద్యోగుల్లో పోటీ వలన సంక్షోభానికి కారణమని నీతి ఆయోగ్ చెబుతోంది. వారి నివేదికలో ఒక ఉదాహరణను జోడిస్తూ ఇటీవల కేవలం 55 వేల ప్రభుత్వ పోస్టులు కోసం ఏకంగా 1.86 కోట్ల దరఖాస్తులు రావడం నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలి యచేస్తోంది. ఇలా వృత్తి ఉద్యోగాలేమీ లేకుండా ఖాళీగా ఉన్నవారిని ‘నీట్’ కేటగిరిగా విభజించింది. ఈకేటగిరీలో ఉన్న88 శాతం మంది గృహసంబంధిత ‘ఇంటిపనుల్లో’ నిమగ్నమై ఉన్నారని పేర్కొంది. అంటే వారెవరికీ మంచి ఉద్యోగాల శిక్షణ ఏమీలేనందున ఖాళీగా ఉన్నారని చెబుతూనే వాళ్లకు శిక్షణనిచ్చే అవకాశాలను ప్రధానంగా చర్చించింది.

Jobs

‘పట్టా’లతో తృప్తి

దేశంలోని వర్క్ ఫోర్ను పాఠశాల విద్యార్థు లో, ఉన్నత విద్య, ఫార్మల్, ఇన్ఫార్మల్ వర్కర్లు, ‘నీట్’ యువత మహిళలు అనే ఐదు విభాగాలుగా విభజించి నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సిన ఆవశ్యకతను తెలియచేస్తోంది. ప్రభుత్వమే వారికి ఆర్ధిక సహాయం చేయాలని సూచి స్తోంది. ఆయా రాష్ట్రాలు తమ ప్రాంతానికి అవసరమైన స్కిల్స్, నేర్పే దిశగా ప్రణాళికలు రూ పొందించుకోవాలని స్పష్టం చేసింది. మార్కెట్ డిమాండ్కు తగినట్లుగా నేటి పట్టభద్రులు తమ నైపుణ్యాలను పెంచుకుంటేనే పేద, మధ్య తరగతి విద్యార్థులకు కాలేజీ ఫీజులు భరించడమే కష్టమౌతున్న తరుణంలో కొత్తగా కోర్సులు నేర్చుకోవడం వారి తలకుమించిన భారమౌతోంది. ఈ నేపథ్యమేవారిని ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడే పరిస్థితి తెస్తోంది. అవేమీ కానరాక కేవలం కాగితం ‘పట్టా’లతో తృప్తి పొం దుతున్నారు. ఆ తర్వాత ‘పని’కి రాకుండాపోతున్నారు. ఈ దేశ యువశక్తిని సక్రమంగా వినియోగించే దిశగాఆలో చనచేసి ‘పట్టా’ లిచ్చే కర్మాగారాలస్థానే ‘స్కిల్డ్’ శిక్షణనిచ్చి ప్రభుత్వమే వారికి ఉద్యో గాలివ్వడం వల్ల యువతలో నైరాశ్యం తొలగుతుంది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 8.23 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇటీవలనే సమాచారం బయట కొచ్చింది. వీటిని భర్తీ చేస్తే కొంతమందికైనా కొలువులు దొరకుతాయి కదా!

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News education Employment job-seekers jobs latest news Latest Telugu News Telugu News unemployment Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.