SIR : ఎందుకో ఏమోకానీ ఏ ముహుర్తాన సర్ ప్రారం భించారో గానీ ఆది నుంచి అన్నీ హంసపాదుల తోనే నడుస్తోంది. తాజాగా తెలంగాణలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ గడువు ముగిసింది. ఆఖరి క్షణాల్లో కూడా ఆదరాబాదరాగా తమ ఓటు ఉందో లేదో చూసు కోవడం ‘సర్’కి అవసరమైన పత్రాలు చూసే పనిలో ఓటర్లంతా అప్రమత్తం కావడం విశేషం. అయినా తెలం గాణలో కోటి 31 లక్షల వయోజనుల ఓటు హక్కు అని శ్చితిలోకి నెట్టబడిందన్న ఆరోపణలు నడుస్తున్నాయి. చాలా రాష్ట్రాలతో పోల్చి చూస్తే ‘అనామలీస్’ లెక్కల జాబితాలో దాదాపు 73 లక్షల ఓట్లు ఉండి ఉంటా యన్న అంచనా. వీరిలో చనిపోయినవారి ఓట్లు తొల గింపు, రెండేసి చోట్ల ఒకే వ్యక్తికి ఓటుహక్కు లభించగా వాటిలో ఒక దానిని తొలగించే విషయంలో బిఎల్ఎల యంత్రాంగం చేసిన ప్రయత్నాలు సానుకూల పడకపోవ డంతో అన్నీ పెండింగ్లో ఉండి పోయాయి. తెలంగాణలో మొత్తం 3.38 లక్షల పైచిలుకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తే వాటిలో చాలా ఫారాలు డిజిటలైజేషన్కు చేరలేదు. వివిధ రాజకీయ పార్టీలు తమ యంత్రాంగాన్ని సిద్ధం చేసినా ఓటర్ల జాబితాలో తొలగింపులు సమంజ సంగా ఉన్నాయా? లేదో ప్రక్రియలో ముందడుగు వేయ లేకపోయారు. ఈ రాష్ట్రంలో మొత్తం ఓటర్లలో వివరాల సరిపోల్చుకోలేని పరిస్థితులలో కొన్ని పోతే రేపు ఎన్నికల సమయంలో ‘పోలింగ్ బూత్’ వరకు ఎంత మంది వస్తారు? ఎందరు సెలెక్టిక్ ఓటర్లుంటారు. ఏ పార్టీని ఎన్నుకోవాలని ఆకాంక్షిస్తారో ఇవన్నీ లెక్కలేసుకుంటే అన్నిటి కన్నా ప్రధాన రాజకీయ పార్టీలకే సమస్యలు మెడకు చుట్టుకుంటాయి.
Read Also : SIR : ఉమ్మడి ఖమ్మంలో దాదాపు 3 లక్షల ఓట్లు ఔట్
SIR : అనుమాన బీజాలు
ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించగానే ఓటు హక్కు పునరుధ్ధ రణ, పునర్విచారణలో వాటిలో కొన్ని తిరిగి జాబితాలో సర్దుబాటవుతాయి. తమ వివరాలతో మరోసారి ఎన్నికల కమిషన్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిని కలిస్తేనే ఓటు హక్కు నిలిచే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎంత మంది శ్రద్ధ వహిస్తారో ఎవరికీ అర్థంకాదు. ముసాయిదా జాబితా ప్రకటనలోగానే ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేసుకునే ప్రక్రియలో అధికార పార్టీ ముందుంది. ఎన్నికలవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలిగించడం మంచిదే కానీ అనాలోచి తంగా పెట్టిన షరతులు ప్రజల్లో భయాందోళనలు రేకె త్తడమే ఆక్షేపణీయం. ఉనికి దొరకని ఓటర్ల పేరుతో దొంగ ఓటర్ల జమానాకు అవకాశమివ్వకుండా వాళ్ల పేర్లు తొలగించడం ఎంత ముఖ్యమో నిజమైన ఓటు హక్కును కాపాడడమూ అంతే ముఖ్యం. ఓటర్ల జాబితాలో లోపా లను గుర్తించడం ప్రజ స్వామ్య ప్రక్రియలో భాగమే కానీ ప్రతి తొలగింపును రాజకీయ ఆరోపణలకు ఆస్కారంగా తీసుకోవడం పార్టీలకు అంత మంచిది కాదు. కానీ ‘నర్’ ప్రక్రియ మొదలైనప్పట్నించి అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ పై అనుమాన బీజాలు మొలకెత్తాయి. అందుకే ‘సర్’ ప్రక్రియ అసాంతం తప్పులతడకగా భావించే ఆస్కారం కలిగింది. దానికితోడు కారణాలేమైనా భారీ ఎత్తున తొలగింపుల సంఖ్య ఉండడంతో రాజకీయ పార్టీ ల్లో అలజడి రేగింది.
ఓటరు బితాను ప్రామాణికంగా తీసుకోవడమే ‘సర్’ ఉద్దేశం
జంటనగరాల్లో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ||ఇప్పటిదాకా 56.3 శాతంమాత్రమే ఉంది. దాంతో విద్యావంతులకు చెందిన ఎన్నో ఓట్లు తొలగించబడినట్లుగా నిర్ధారణ జరగడంతో ఎక్కడో ఏదో తేడా ఉన్నట్లు గోచరిస్తోంది. ఇలాంటి సమస్యలు పరిష్క రించి అందరికీ ఓటు హక్కు కల్పించాలి. ఓటు హక్కు లేదని బాధపడే వారుండకూడదు. అనే లక్ష్యంతో ముం దుకు నడిచేటప్పుడు కొన్ని సాధక బాధకాలుంటాయి. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, సంగారెడ్డి జిల్లా ల్లో వలస జనాభా ఎక్కువ. సమస్యకు మూలం ప్రధా నంగా 2002 నాటి ఓటరు బితాను ప్రామాణికంగా తీసుకోవడమే కాగా ‘సర్’ ఉద్దేశం. నిజమైన ఓటర్లను తొలగించడం కాదు. జాబితాను ప్రక్షాళించడమేనని ఒక టికి పదిసార్లు విన్నవించుకున్నా జాబితా ప్రక్షాళన మరిం త సంక్లిష్టం అయిపోతోందనే సంశయానికి దగ్గరలో వరకు తీసుకెళ్లింది. తాజా విషయాల్లోకెళ్తే, హైదరాబాద్ లో 45 శాతం మాత్రమే మ్యాపింగ్ జరిగింది. ఈ కార ణాల రీత్యా హైదరాబాద్లో ఓటరు జాబితాలో సవర ణలు ఎంత గ్యాప్ ఉందో తెలుసుకోవచ్చు. డ్రాఫ్ట్ జాబితా తర్వాత ప్రభుత్వం మరిన్నిజాగ్రత్తలు తీసుకోవాలి. ఆధార్, ఫోన్ నంబరు ద్వారా కూడా ఓటర్ల ధ్రువీకరణ విధానా న్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో మరిన్ని సహకార కేంద్రాల ఏర్పాటు కూడా అవసరం.
ఓట్లు తొల గింపు
మూడో దశలో 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘సర్’ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతకు పూర్వమే జరి గిన రెండో దశ 10 రాష్ట్రాల్లో, 2 కేంద్రపాలిత ప్రాంతా ల్లో 5.72 కోట్ల పేర్లు జాబితా నుంచి తొలగించారు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 2.05 కోట్ల ఆంధ్రప్రదేశ్లో మూడో దశలో 44.89లక్షలు ఐదారు కోట్ల ఓట్లు తొల గింపు ప్రధానంగా జరిగింది. వీటికి లెక్కాపత్రాలుండవని చెప్పలేం కానీ ఎవరికి కొత్తగా ఓటుహక్కు కల్పించబడిం దో ఎవరికి ఆ హక్కు తొలగించబడిందో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈరాష్ట్రంలో దాదాపు 44.89 లక్షలమేరకు ఉంది. ఇకపై క్లెయిమ్లు, అభ్యంతరాల ప్రక్రియ ఉంది. పౌరుని ప్రజాస్వామ్య హకు స్త్రీను ఎట్టి పరి స్థితుల్లోనూ తొలగింపునకు గురవరాదు. తెలంగాణలో ఓటర్ల వద్ద నుంచి సేకరించిన 78.26 శాతం ఎన్యూమ రేషన్ ఫారాల సమీక్ష, ఇంకా వారి నుండి సేకరించలేక పోయిన 22 శాతం ఫారాలను కూడా విస్తృత తనిఖీ, సేకరణ సమీక్షల ప్రాతిపదికన వారి హక్కులు తేల్చగలి గితేనే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గండం గడిచి మెట్లెక్కుతుంది. దాదాపు ఐదో వంతు ఓటర్ల పేర్లు తుది జాబితా నుంచి తొలగించే ప్రమాదం నుంచి కాపాడాల్సి న బాధ్యత ఎన్నికల కమిషనరే.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: