📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Elnino : పారా హుషార్!

Author Icon By Sudha
Updated: October 26, 2026 • 3:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Elnino : రాబోయే పది నెలల కాలంలో ‘ఎల్న్ని’ మనల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది ‘పారాహుషార్’ అంటూ తెలంగాణ పాలకులు ఇప్పుడు ఊరూవాడా అప్రమత్తం చేస్తున్నారు. హఠాత్తుగా మీదపడిన కోవిడ్ గురించి తెలిసోతెలియకో ముందు జాగ్రత్తలు వహించక సొంత వారి ప్రాణాల్నే కాపాడుకోలేకపోయిన అనుభవాలున్న తెలంగాణ ముందస్తుగానే రాబోయే ప్రమాదాల్ని గుర్తించి సకల జనాన్ని అప్రమత్తం చేయడం అభినందించదగిన విషయమే. ఇది పాలకుల ముందుచూపును తెలియ చేస్తోంది. ‘ఎల్నినో’ ఉధృతంగా మారి రాబోయే రోజుల్లో భారతదేశాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్న హెచ్చ రికలతో భారత వాతావరణ సంస్థ ఇప్పటికే మేల్కొ ల్పింది. చరిత్రలోనే అత్యంత బలమైన ఎల్ నినోను ఎదు ర్కోవాల్సి వస్తుందని దాని ప్రభావాన్ని, అసాధారణ ఉష్ణో గ్రతలు పెరగడంతో జనం విలవిల్లాడి పోతుంటారని వారి హెచ్చరికల సారాంశం. ఈ యేడాది నవంబరు నుంచి 2027 జనవరి మధ్యకాలంలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటుకన్నా 3.8 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈసారి వర్షాకాలంలో తెలంగాణ లో దాదాపు 20 శాతం వర పాతం లోటు ఏర్పడింది. దాని ప్రభావం రాష్ట్రంలో పంటలపై పడింది. త్వరలో భూగర్భజల మట్టాలు అడుక్కిపడిపోయి లోతుకు వెళ్లి పోయిన కారణంగా నీటి వసతి సౌకర్యాలు మృగ్యమౌతా యన్న సంకేతాలు లేకపోలేదు. రిజర్వాయర్లలో నీటి మట్టాలు 30 నుంచి 40శాతమే ఉన్నాయి.

Read Also : Arnab Cyclone: ఏపీకి తుపాను ముప్పు.. కోస్తా తీరానికి అతి తీవ్ర హెచ్చరిక!

Elnino

Elnino : చుక్క నీటి కోసం వెంపర్లాడే పరిస్థితి

భూగర్భ జలాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటిపోతే యాసంగి వరి సాగు సాధ్యం కాదనే అంచనాతో ప్రభు త్వాలు నీటి లభ్యతను బట్టి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం అన్వేష్ స్తోంది. ఎండల తీవ్రతతోపాటు సాగు, తాగు నీటి అవసరాలు పెరగడంతో విద్యుత్తు వినియో గమూ పెరిగింది. రాబోయే 7,8 నెలలో వ్యవసాయ కూలీలకు జీవనోపాధి కల్పించడం కోసం విబిజి రాంజీ పథకం కింద పనులు కల్పిస్తున్నారు. కానీ వారుపనులు చేయడం కోసం మళ్లీ నీటి ఊటల వెంట పరుగెత్తాల్సి ఉంటుంది. ఒక చుక్క నీటి కోసం వెంపర్లాడే పరిస్థితి కళ్లెదుట కళాశిల్పంలా కనపడుతోంది. తెలంగాణాలో 358 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తే మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 388 కరవు మండలాలను ప్రకటించారు. వాటిలో తీవ్ర కరవు 283 మండలాలున్నాయి. కరవు మండలాల ఎంపికలో అనేక ఔచిత్యాలు, వైరుధ్యాలున్నా అక్కడి పరిస్థితుల అంచనా లో ఎవరూ కరవులేదని చెప్పే పరిస్థితి లేదు. ప్రభు త్వాలు మాత్రం ఆగమేఘాల మీద రైతు జనాలను సైతం అప్ర మత్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకాంగ్రెస్ పాలకుల అధీనంలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఏరీతిన సహకరిస్తుందోనన్న భయంతో ముందస్తు జాగ్రత్తలకు త్వరపడుతోంది. ఇప్పటికే వరి సాగుకు అధిక నీరు అవసరం ఉన్నందున శుక్రవారం నాటి మంత్రివర్గ ఉప సంఘ సమావేశంలో రాష్ట్రాన్ని ఎల్సినో ప్రభావంతో వెన్నాడే పరిస్థితులపై చర్చసాగిం ది. ఇందులో పలు ఆసక్తికర వివరాలను బయటపడ్డాయి.

ప్రత్యామ్నాయా లకై అన్వేషించాలి

అక్టోబరులో వర్షాలుతగి నంతగా వడలేదు. తాజా అంచనా ప్రకారం రాష్ట్రంలో 23.4లక్షల ఎకరాల్లోని పంటల సాగుపై ఎల్నినో ప్రభావం పడింది. సాగు విస్తీర్ణంలో ఇది 18.6శాతం మాత్రమే. ఇందులో పత్తి 15.88 లక్షల ఎకరాల్లో వరి 4.78 లక్షల ఎకరాల్లో ఎండిపోయింది. కంది, మొక్క, మిరప, జొన్న పంటలు ఎక్కువ విస్తీర్ణంలో దెబ్బతిన్నాయి. వరా కాలంలో సాగు విస్తీర్ణం 139.28 లక్షల ఎకరాల నుంచి 126.06లక్షల ఎకరాలకు సాగు తగ్గగా, వరి ఒక్కటే 18శాతం తగ్గింది. ఇలా దేశంలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. అలా తగ్గిన తొలి ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మహారాష్ట్రాలు కూడా తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నాయి. తెలం గాణలో 621 మండలాల్లో 324 మండలాల్లో భూగర్భ జలాలు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం రిజర్వాయర్ల లో తాగునీటికి మాత్రమే సరిపడే నీటి నిల్వలు ఉన్నం దున రేపటి ఖరీఫ్ ఆరంభం వరకే తాగునీటికి వాడు కోవాలి. ఈలోగా జలాశయాల్లోని నీటి తోడకానికి పం పింగ్ వ్యవస్థలను సిద్ధం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసు కోవాల్సిన ఆవశ్యకతను నీటిపారుదల ప్రతి పాదించింది. దాంతో ఆయా మండలాల్లో ఆవశ్యకతల రీత్యా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం నిధుల విడుదల చేసింది.

Elnino

ఆపన్నహస్తం కోసం ఎదురు

రాష్ట్రం లోని భారీ మధ్యతరహా ప్రాజెక్టుల నీరు నిల్వసామర్థ్యం 470.2టిఎంసిలు కాగా 179.6 టిఎంసిల నీటి నిల్వలే ఉన్నాయి. వాటిలో మిషన్ భగీరథకు 50 టిఎంసిలు పోగా, మిగిలిన వాటిలో హైదరాబాద్లో తాగు నీటి అవసరాలకు 20 టిఎంసిలు తాత్కాలికంగా అవసరమ వుతాయి. ఇతర పురపాలికలు, పరిశ్రమలకు మరో 15 టిఎంసిలు కేటాయించారు. అంటే నీటి సరఫరాలోని సంక్లిష్టతలను క్రమబద్ధం చేయాలంటే ప్రత్యామ్నాయా లకై అన్వేషించాలి. గతంలో కన్నా ఈ యేడాది విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం బాగా దెబ్బతింది. పశుదాణాకు బాగా కొరత ఏర్పడి పశువులకు ప్రాణసంకటంగా మారినందున ఎండాకాలం వచ్చేలోగానే 2వేల టన్నుల పశుగ్రాసాన్ని సమీకరించుకోవాలి. ఒక్క పశుగ్రాసం సమకూర్చుకునేం దుకే దాదాపు రూ.100 కోట్ల నిధులు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో తాజా ఇబ్బందులను ఎదుర్కొంటూనే, ఇకపై ఎదురయ్యే సమస్యలకు నిధులు సమకూర్చుకునే యోచ నలో ప్రభుత్వం నకల అవస్థలు పడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Breaking News Climate Change el nino El Nino Warning latest news Latest Telugu News Telugu News Vaartha Weather Alert Weather Update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.