Drone attack on Israeli Prime Minister Netanyahus residence

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు నివాసంపై డ్రోన్‌ దాడి

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణవాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఆందోళనకర ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో డ్రోన్‌ దాడి జరిగిందని పలు కథనాలు వెలువడ్డాయి. సిజేరియాలోని ఆయన నివాసం లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది. ఆ సమయంలో ప్రధాని, ఆయన సతీమణి నివాసంలో లేరని పేర్కొంది. ఇక ఈ ఉదయం లెబనాన్‌వైపు నుంచి డ్రోన్లు దూసుకొస్తున్న తరుణంలో ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగాయి.

Advertisements

ప్రస్తుతం ఇజ్రాయెల్‌.. హమాస్‌, హెజ్‌బొల్లా గ్రూప్‌లు అంతమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. హమాస్‌ అధినేత యాహ్యా సిన్వర్‌తో సహా నాయకత్వ హోదాలో ఉన్న పలువురిని నెతన్యాహు సేనలు(IDF) హతమార్చాయి. అలాగే లెబనాన్‌లోని హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్ నస్రల్లా సహా పలువురు కీలక కమాండర్లను మట్టుపెట్టింది. సిన్వర్ మృతి తర్వాత స్పందించిన హెజ్‌బొల్లా.. తమ పోరాట దశను మార్చేలా ప్రణాళికలు వేసుకున్నామని తెలిపింది. క్షిపణులు, డ్రోన్లతో దాడులు తీవ్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హెజ్‌బొల్లా కేంద్రమైన లెబనాన్‌ వైపు నుంచి మూడు డ్రోన్లు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. సిజేరియాలోకి ఒక భవనాన్ని డ్రోన్ ఢీకొట్టినట్లు తెలిపాయి. మరో రెండింటిని అడ్డుకున్నామని పేర్కొన్నాయి.

ఇదిలా ఉంటే.. సిన్వర్ మృతితో యుద్ధం కీలకమలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం తమ బందీలు విడుదలయ్యేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేసింది. హమాస్‌ మిలిటెంట్లు ఆయుధాలను వదిలి.. బందీలను విడుదల చేస్తే వెంటనే యుద్ధం ముగిస్తామని నెతన్యాహు ప్రకటించారు. ఆపై హమాస్‌ తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడిపే అవకాశం కల్పిస్తామన్నారు. లేదంటే వెంటాడి మరీ వారిని హతమరుస్తామని హెచ్చరించారు. దానికి తగ్గట్టే ఉత్తర గాజాలోని జబాలియా శిబిరంపై శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. 33 మంది పాలస్తీనా వాసులు మృతి చెందగా.. అందులో 21 మంది మహిళలే ఉన్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటివరకు 42,500 మందికి పైగా మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

Related Posts
శ్రీశైలం మల్లన్న సేవలో అక్కినేని కుటుంబం
akkineni family srisailam

శ్రీశైలానికి పర్యటనకు వచ్చిన అక్కినేని కుటుంబం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన కుమారుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల దంపతులు Read more

ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి
Terrorist attack on army vehicle

ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదన ఆర్మీ అధికారులు శ్రీనగర్‌: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం Read more

Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై నమోదైన పిటిషన్లు
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై నమోదైన పిటిషన్లు

జాతీయ గీతాన్ని అవమానించిన ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై కోర్టులో పిటిషన్ దాఖలైంది. పాట్నాలో ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ గీతం ఆలపిస్తుండగా, Read more

కేసీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపిన పవన్ , జగన్
తిరిగి ప్రజల్లోకి చురుగ్గా రానున్న కేసీఆర్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈరోజు (ఫిబ్రవరి 17) తన 71వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఉపముఖ్యమంత్రి Read more

×