ఆ బహుమతులు తేవద్దు : ఎంపీ తేజస్వీ సూర్య రిక్వెస్ట్

ఆ బహుమతులు తేవద్దు : ఎంపీ తేజస్వీ సూర్య రిక్వెస్ట్

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం మార్చి 6వ తేదీన బెంగళూరులో ఘనంగా జరిగింది. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను.. తేజస్వీ సూర్య పెళ్లి చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహ మహోత్సవానికి కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, వి సోమన్న, బీజేపీ నేతలు అన్నామలై, అమిత్ మాలవీయ, బీవై విజయేంద్ర తదితరులు వచ్చారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సైతం నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. దేశంలోని అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా పేరు పొందిన భాజపా పార్లమెంట్ సభ్యుడు తేజస్వీ సూర్య వివాహం నాలుగు రోజుల క్రితమే ఘనంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆదివారం రోజే ఈయన రిసెప్షన్ జరగ్గా.. ముందుగానే ఆయన బంధువులు, స్నేహితులకు ఓ రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఆ బహుమతులు తేవద్దు : ఎంపీ తేజస్వీ సూర్య రిక్వెస్ట్

స్నేహితులకు ఓ విన్నపం

వివాహం జరిగిన మూడ్రోజుల తర్వాత అంటే మార్చి 9వ తేదీ ఆదివారం రోజు బెంగళూరులో వీరి రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు ముందే ఎంపీ తేజస్వీ సూర్య.. రిసెప్షన్‌కు వచ్చే బంధువులు, స్నేహితులకు ఓ విన్నపం చేశారట. తమను ఆశీర్వదించడానికి వచ్చేటప్పుడు ఓ రెండు బహుమతులు మాత్రం అస్సలే తీసుకు రావొద్దని వివరించారట. అందులో ఒకటి బొకేలు కాగా మరోటి డ్రై ఫ్రూట్స్. తమ పెళ్లికి వచ్చిన అనేక మంది అతిథులు ఈ రెండింటిని బహుమతులుగా అందజేసినట్లు వివరించారు.
వృథా ఖర్చులను నివారించడానికి..
ముఖ్యంగా పూలు, బొకేలు ఎక్కువగా రాగా.. పెళ్లి జరిగిన 24 గంటల్లోపే వాటిలో 85 శాతం పూలను పారవేయాల్సి వచ్చిందని ఎంపీ తేజస్వీ సూర్య వెల్లడించారు. ప్రతీ ఏడాది వివాహాల సమయంలో దాదాపు 3 లక్షల కిలోల డ్రై ఫ్రూట్స్ మిగిలిపోతున్నాయని.. వాటిపై దాదాపు రూ.315 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సర్వేలో తేలినట్లు చెప్పుకొచ్చారు.

Related Posts
ముందంజలో డీఎంకే!
ఈసారి కూడా డీఎంకే గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

తమిళనాడులోని ఈరోడ్ (తూర్పు) అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ ఓట్లు లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలు లెక్కించనున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం Read more

మహేష్ బాబు మూవీపై ఒడిశా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు
మహేష్ బాబు మూవీపై ఒడిశా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లోతెరకెక్కుతున్న చిత్రం SSMB29. టాలీవుడ్‌ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా మారిన ఈ సినిమా గురించి Read more

బడ్జెట్ రోజున క్రీమ్ కలర్ శారీతో నిర్మలా సీతారామన్
nirmala

ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన Read more

దావోస్ : ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు
Babu With Fellow CMs In Dav

దావోస్‌లో జరిగిన 'కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్' సమావేశంలో ఒకే వేదికపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర Read more