हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

KL Rahul: పాప పేరును రివీల్‌ చేసిన కేఎల్ రాహుల్ ఏం పేరు పెట్టారో తెలుసా!

Anusha
KL Rahul: పాప పేరును రివీల్‌ చేసిన కేఎల్ రాహుల్ ఏం పేరు పెట్టారో తెలుసా!

భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి దంపతులకు ఇటీవల కూతురు పుట్టిన సంగతి తెలిసిందే.కేఎల్ రాహుల్ శుక్రవారం తన 33వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి దంపతులు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో తమ కూతురి పేరును రివీల్ చేశారు. ఆ చిన్నారికి “ఇవారా విపుల రాహుల్” అని పేరు పెట్టినట్లు పోస్ట్ లో కేఎల్ రాహుల్ తెలిపాడు. భార్య అతియా శెట్టి, కూతురు ఇవారాతో ఉన్న క్యూట్ ఫోటోను కేఎల్ రాహుల్ పోస్ట్ చేశాడు.ఆ పేరుకు అర్థాన్ని కూడా వివరించారు. ‘ఎవారా’ అంటే దేవుడిచ్చిన బహుమతి అని అర్థం అంట. ఇక విపుల తన నానమ్మ (అథియా శెట్టి నానమ్మ) గౌరవార్థం యాడ్‌ చేసినట్లు తెలిపారు. ఇక చివరిలో తండ్రి పేరు రాహుల్‌ అని అథియా తన స్టోరీస్‌లో రాసుకొచ్చారు. ఇవాళ కేఎల్‌ రాహుల్ పుట్టినరోజు సందర్భంగా అథియా శెట్టి తమ కుమార్తె పేరును రివీల్‌ చేశారు.

ప్రేమ,వివాహం

కేఎల్ రాహుల్-అతియా శెట్టి దంపతులు మార్చి 24న తల్లిదండ్రులయ్యారు. కేఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. అతియా శెట్టికి కూతురు పుట్టడంతో తాతయ్య సునీల్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు. మనవరాలు పుట్టిన తర్వాత తన జీవితం మారిపోయిందన్నారు. బాలీవుడ్‌ నటి అయిన అథియా శెట్టి క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. 2023 జ‌న‌వ‌రి 23న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది.ముంబైకి 80 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఖండాల్లోని సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌లో కొద్దిమంది సన్నిహితుల స‌మ‌క్షంలో వీరి వివాహం జ‌రిగింది. ఇక ఈ జంట తాము తల్లిదండ్రులం కాబోతున్న వార్తను గతేడాది నవంబర్‌లో సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌కు కెఎల్ రాహుల్ దూరమయ్యారు. ఎందుకంటే అదే రోజు ఆయన భార్య అతియా శెట్టి ఒక పాపకు జన్మనిచ్చింది.ఇలా రాహుల్ ఇటీవలే తండ్రి అయ్యారు. డెలివరీ సమయంలో భార్యతో ఉన్న ఇతడు ఆ తర్వాత వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరారు. డిల్లీ తరపున ఇటీవల ఓ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి మరోసారి తన సత్తాఏంటో నిరూపించుకున్నాడు.ఇక రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్​లో బిజీగా ఉన్నాడు. భార్య ప్రసవం నేపథ్యంలో ఈ సీజన్‌లో దిల్లీ ఆడిన తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. రెండో మ్యాచ్​ నుంచి రాహుల్ జట్టుతో జాయిన్ అయ్యాడు. దిల్లీ క్యాపిటల్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ 5 మ్యాచ్​ల్లోనే 59.50 సగటుతో 238 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, దిల్లీ ఏప్రిల్ 19 (శనివారం) గుజరాత్ టైటాన్స్​తో తలపడనుంది. ఈ మ్యాచ్​ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.

Read Also: IPL 2025: సీఎస్ కె జట్టులోకి డెవాల్డ్ బ్రెవిస్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870