అన్ని భాషల సినిమాల్లోనూ ఐటెం సాంగ్ అంటే మేకర్స్‌కి ముందుగా తమన్నానే గుర్తుకొస్తుంది. రజినీకాంత్ ‘జైలర్’,, బాలీవుడ్ మూవీ ‘స్త్రీ 2’లో తమన్నా చేసిన ఐటెం సాంగ్స్ సూపర్‌హిట్ అయ్యాయి. నువ్వు కావాలయ్యా అంటూ జైలర్‌లో తమన్నా వేసి స్టెప్పులకు ఆడియన్స్ పూనకాలతో ఊగిపోయారు.అందానికి అందం, ఆపై అదరగొట్టే డ్యాన్సులతో తమన్నా తన రేంజ్‌ను పెంచుకుంటూనే ఉంది. అందువల్లే ఆమెతో సినిమాలో ఒక్క సాంగ్ అయినా చేయించాలని మేకర్స్ తాపత్రయపడుతుంటారు.ఈ నేపథ్యంలోనే మరో భారీ బడ్జెట్‌లో మూవీలో తమన్నా ఐటెం సాంగ్‌కి రెడీ అయిపోయింది. అజయ్ దేవ్‌గణ్ తాజా చిత్రం ‘రైడ్ 2’లో తమన్నా ప్రత్యేక గీతంలో నటించింది.గతంలో అజయ్ దేవ్‌గణ్ సరసన తమన్నా ‘హిమ్మత్ వాలా’లో నటించిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ వర్గాల్లో
పాట ఏదైనా సరే తన డ్యాన్స్ స్కిల్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది తమన్నా. ఈ నేపథ్యంలో ‘నషా ‘ ఫుల్ సాంగ్ రిలీజైంది, ఈపాటలో తన కాస్ట్యూమ్, స్క్రీన్ ప్రజెన్స్, డ్యాన్స్ స్టెప్పులతో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. దీంతో ఈ నషా పాట సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. 24 గంటల్లోనే ఈ సాంగ్ 12 మిలియన్ వ్యూస్ సాధించి, యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకొళ్తోంది.ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ఈ పాటకు తమన్నా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందోనని చర్చ నడుస్తోంది. హీరోయిన్గా భారీగానే పారితోషికం తీసుకునే ఈ బ్యూటీ, స్పెషల్ సాంగ్స్‌కు కూడా ఇంచుమించు ఆ రేంజ్‌లోనే వసూల్ చేస్తుందని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే నషా పాటలో ఆడిపాడేందుకు తమన్నా రూ.1 కోటి రెమ్యూనరేషన్ అందుకుందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీంతో, స్క్రీన్‌పై 5 నిమిషాలు కనిపించినందుకు తమన్నా ఇంత భారీ మొత్తం తీసుకుందా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
రైడ్ 2
ఈ సీక్వెల్‌లోనూ అజయ్ దేవగన్ ఆదాయపు పన్ను శాఖ అధికారి పాత్రలోనే కనిపించనున్నారు. కానీ ఈ సారి కథ మరింత బలంగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడుకుని ఉండనుందని సమాచారం.ఎప్పటిలాగే అజయ్ దేవగన్ శక్తివంతమైన పాత్రలో, అధికారంగా, గంభీరంగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నారు.రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 01న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.
Read Also: Raha Kapoor:రణ్‌బీర్,ఆలియా కుమార్తె రాహా ఆస్తుల విలువెంతో తెలుసా!