నాన్-వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంతగా ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ప్రతిరోజూ చికెన్ తినడం ఆరోగ్యానికి మేలు చేసేటంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరంపై దుష్ప్రభావాలు చూపే అవకాశముంది.
యూరిక్ యాసిడ్ పెరుగుదల – ఎముకల సమస్యలు
చికెన్‌లో ఉన్న ప్రోటీన్ అధికంగా తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోతుంది. ఇది ముఖ్యంగా ఎముకలు, కీళ్ల సమస్యలకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో గౌట్ (Gout) అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల కీళ్ల నొప్పులు, వాపులు ఏర్పడతాయి.

గుండె, కిడ్నీ సమస్యలు
రోజూ చికెన్ తీసుకోవడం గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశముంది. చికెన్‌లో కొలెస్ట్రాల్, కొవ్వు ఎక్కువగా ఉండటంతో గుండె జబ్బులు వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు చికెన్ తినడాన్ని నియంత్రించుకోవడం మంచిదని సూచిస్తున్నారు, ఎందుకంటే అధిక ప్రోటీన్ వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది.
మితంగా తీసుకోవడం మంచిది
ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చికెన్‌ను మితంగా తీసుకోవడం ఉత్తమం. వారంలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, మసాలా, డీప్ ఫ్రై చేసుకోవడం కన్నా వేపుడు, గ్రిల్డ్ లేదా ఉడకబెట్టిన విధానంలో తీసుకుంటే ఆరోగ్యపరంగా మంచిది.