Diwali Gift. Central Govt Employees Likely To Get 3 DA Hike

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక..డీఏ 3 శాతం పెంపు

న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా డీఏను 3 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. డీఏ పెంపునకు సంబంధించి ఎప్పుడైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని పేర్కొంది.

ఈరోజు ఉదయం ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు డీఏ పెంపుకు ఆమోదం తెలిపారు. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నిర్ణయంతో కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం సాధారణంగా ప్రతి సంవత్సరం రెండుసార్లు ఉద్యోగుల డీఏను పెంచుతుంది.

పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను అందిస్తారు. ఈ ఏడాది మార్చిలో కూడా ఉద్యోగుల డీఏను, పెన్షనర్ల డీఆర్‌ను కేంద్రం 4 శాతం పెంచింది. పెంపుపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత… ఇప్పటి వరకు ఉన్న 50 శాతం డీఏ 53 శాతానికి చేరుకుంటుంది.

Related Posts
భారతదేశ సముద్ర భద్రతకు నావికాదళ యోధులు
భారతదేశ సముద్ర భద్రతకు నావికాదళ యోధులు1

ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి మరియు ఐఎన్ఎస్ వాఘ్షీర్ లను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు, ఇది దేశ సముద్ర భద్రతకు అపూర్వమైన ప్రోత్సాహాన్ని ఇచ్చింది. Read more

నాంప‌ల్లి నుమాయిష్ 17వ తేదీ వ‌ర‌కు పొడిగింపు
Extension of Nampally Numaish till 17th

రెండు రోజులు పొడిగించేందుకు పోలీస్ శాఖ అనుమతి హైదరాబాద్ : నగర ప్రజలు ఎంతగానో ఎంజాయ్ చేసే నాంపల్లి నుమాయిష్ మరో రెండు రోజులు కొనసాగనుంది. ఫిబ్రవరి Read more

ఏపీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
ఏపీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ఊహించని తీర్పు ఒకటి సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. బస్సు ఢీ కొట్టడం వల్ల ఓ మహిళ మృతి చెందడంతో.. ఆమె కుటుంబ సభ్యులకు Read more

పాకిస్థాన్-ఆధీన కశ్మీర్‌లో బస్సు నది‌లో పడింది.
pok

పాకిస్థాన్-ఆధీన కశ్మీర్‌లో గిల్‌గిట్-బాల్టిస్టాన్ ప్రాంతంలో నవంబర్ 12న ఒక దుర్ఘటన జరిగింది. ఒక బస్సు, దాదాపు ఇరవై మంది వివాహ అతిథులను తీసుకుని, ఇండస్ నదిలో పడిపోయింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *