vijay antony

మర్డర్‌ మిస్టరీగా విజయ్‌ ఆంటోని ‘గగన మార్గన్’

నటుడిగా దర్శకుడిగా గీత రచయితగా సంగీత దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న విజయ్ ఆంటోని ఇప్పుడు మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌లో నటించనున్నాడు ఈ చిత్రం డిటెక్టివ్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోంది విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని నిర్మిస్తున్న ఈ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు లియో జాన్ పాల్ ఇదివరకు ప్రముఖ ఎడిటర్‌గా పనిచేసిన అనుభవం కలిగి ఉండగా ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

తాజాగా ఈ చిత్రానికి గగన మార్గన్ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ పోస్టర్‌లో విజయ్ ఆంటోని రెండు విభిన్న గెటప్స్‌లో కనిపించారు ఒక దృశ్యంలో విజయ్ ఆంటోని గాయపడి ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తే మరో దృశ్యంలో నీటి అడుగున ఉన్న వ్యక్తి కూడా కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో విజయ్ ఆంటోని పాత్ర కీలకమవ్వడంతో పాటు కథలో సస్పెన్స్ అంశాలు, చక్కటి వినోదం ప్రధానంగా ఉంటాయని అంటున్నారు గగన మార్గన్ అనే టైటిల్ కూడా కథా సారాన్ని ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠను కలిగిస్తోంది చిత్ర యూనిట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి విజయ్ ఆంటోని అందించిన సంగీతం లియో జాన్ పాల్ ఎడిటింగ్ పనితనం, దర్శకుడిగా ఆయన టేక్ ఈ సినిమాను మరింత ప్రత్యేకతనిచ్చే అంశాలు అని భావిస్తున్నారు.

‘గగన మార్గన్’ విజయ్ ఆంటోని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Posts
Shahrukh Khan: కావాల్సిన దానికంటే ఎక్కువ సంపద దేవుడు ఇచ్చాడు.. నా చివరి కోరిక ఇదే: షారుక్ ఖాన్
shah rukh khans king release

బాలీవుడ్ దిగ్గజం షారుక్ ఖాన్ నటుడిగా తన 36 సంవత్సరాల ప్రయాణాన్ని విశ్లేషిస్తూ 23 సంవత్సరాల వయసులో నటుడిగా మొదలుపెట్టానని 27 త్సరాల వయసులో హీరోగా గుర్తింపు Read more

నవంబర్‌లో విడుదల కానున్న ఏకైక భారీ చిత్రం ఇదే కంగువ,
kanguva

స్టార్ హీరో సూర్య ప్రస్తుతం మధురమైన అంచనాలతో కూడిన 'కంగువ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ Read more

ఈ అమ్మడు సూపర్ ఫైట్ లీగ్ పోటీల్లో పాల్గొంది
ritika singh 1

1994లో ముంబైలో జన్మించిన రితికా సింగ్, దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయిక. ఆమె కేవలం ఒక మంచి నటిగా మాత్రమే కాకుండా, Read more

అలాంటి ఎన్‌కౌంటర్‌లు నన్ను కదిలించాయి : టి.జె. జ్ఞానవేల్
tj gnanavel

దర్శకుడు టి జె జ్ఞానవేల్ మాట్లాడుతూ వెట్టయన్ సినిమా నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొంది రూపొందించాను కొన్ని ఎన్‌కౌంటర్ కేసులు,వాటిలో జరిగిన సంఘటనల నుంచి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *