हिन्दी | Epaper
కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? ‘కులిశ వేధ’ అంటే ఏమిటి? చెత్తను ఎటువైపు ఊడవాలి? కుట్టక వేధ అంటే ఏమిటి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం పిశాచ స్థలాలు అంటే? కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? ‘కులిశ వేధ’ అంటే ఏమిటి? చెత్తను ఎటువైపు ఊడవాలి? కుట్టక వేధ అంటే ఏమిటి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం పిశాచ స్థలాలు అంటే? కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? ‘కులిశ వేధ’ అంటే ఏమిటి? చెత్తను ఎటువైపు ఊడవాలి? కుట్టక వేధ అంటే ఏమిటి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం పిశాచ స్థలాలు అంటే? కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? ‘కులిశ వేధ’ అంటే ఏమిటి? చెత్తను ఎటువైపు ఊడవాలి? కుట్టక వేధ అంటే ఏమిటి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం పిశాచ స్థలాలు అంటే?

Vaasthu: దిగ్వక వేధ అంటే ఏమిటి?

Digital
Vaasthu: దిగ్వక వేధ అంటే ఏమిటి?

దిగ్వక వేధ

ఒక గృహం నాలుగు దిక్కుల యందుగాని, గృహం లోపలి భాగం నందుగాని, కిటికీలకు ఎదురుగా కిటికీలు, తలుపులకు ఎదురుగా తలుపులు ఉండకుండా పారుదప్పి.ఉన్నట్లయితే ‘దిగ్వక్త్ర‘ మనే దోషం వేధ కలుగుతుంది. ‘దిగ్వక్తే గర్భనాశస్స్యాత్’ అనే శాస్త్ర వచనానుసారం యిటువంటి దోష పూరితమైన గృహంలో నివసించేవారికి, యజమాని కుటుంబానికి గర్భ స్రావాలు, సంతాన నష్టాలు మొదలైన చెడు ఫలితాలు కలుగుతాయని గమనించాలి. కానీ తలుపుకు ఎదురుగా తలుపు, కిటికీకి ఎదురుగా కిటికీ తప్పనిసరి కాదు! ఎదురుగా తలుపు ‘అవసరమై’ పెట్టవలసి వస్తే ‘పారుదప్పకుండా’ తలుపుకు ఎదురుగానే తలుపు పెట్టుకోవాలి. కిటికీలు కూడా అంతే! అవసరమున్నా లేకపోయినా.. ప్రతి తలుపుకు ఎదురుగా తలుపు, ప్రతి కిటికీకి ఎదురుగా కిటికీ పెట్టగూడదు. తలుపుగానీ కిటికీగానీ పారుదప్పి ఉండకూడదు. అంటే సగం మధ్యలోకి రాకూడదు.

దిగ్వక వేధ

చిపిటక వేధ

ఒక గృహం ‘ఆయము’నను సరించి ఆ గృహం లోపలి ఎత్తు నిర్ధారింపబడుతుంది. గృహం లోపల సాధారణంగా ఉండవలసిన ఎత్తు కంటే తక్కువ ఎత్తు ఉన్నట్లయితే ‘చిపిటకము‘ అనే దోషం వేధ కలుగుతుంది. ఇటువంటి చిపిటక వేధ గల ఇంట నివసించువారు, ఆ గృహ యజమాని అనేక దుర్వ్యసనాలకు లోనుగావచ్చని శాస్త్రవచనం. ముఖ్యంగా దొంగతనం, జూదం, మద్యపానం మొదలైన వ్యసనాలకు లోనుగావచ్చు. గృహ నిర్మాణ సమయంలోనే ‘ఎత్తు’ విషయమై జాగ్రత్త పడటం అత్యంత ఆవశ్యకం.

దిగ్వక వేధ

చిరు ప్రత్యామ్నాయ పద్ధతులతో మంచి ఫలితం

ఇటువంటి నామరీత్యా(వివేకానంద) పశ్చిమ ముఖద్వారమున్న ఇంట్లో నివసించినట్లయితే తక్కువ శ్రమతో ఎక్కువ మంచి ఫలితాలను పొందగలరు. ఎదురయే ప్రధాన సమస్య ‘ద్వైదీ భావం’. అంటే ఏదైనా నిర్ణయం తీసుకోవటంలో ఊగిసలాడే పరిస్థితిలో ఉండిపోతూ ఉంటారు. అందువల్ల అందివచ్చిన అవకాశాలు సైతం కనుమరుగవుతాయి. ఈ పరిస్థితి పునరావృతం అవుతూ ఉండటం వలన ఎక్కువ ధనాన్ని, సమయాన్ని నష్టపోతూ ఆత్మ విశ్వాసాన్ని కూడా కోల్పోయే పరిస్థితులు నెలకొంటాయి. అందుకని ముందస్తుగా తేలికపాటి ‘ప్రత్యామ్నాయ పద్ధతులు’ ఆచరించండి. లేత ఆకుపచ్చ, తెలుపురంగు దుస్తులు ధరించడం, అవే రంగు పాదరక్షలు ధరించడం, నలుపు రంగు వస్తువులు కలిగి ‘ఉండకపోవడం’, రాత్రుళ్లు వృద్ధిచంద్రుడిని కొంతసేపు ప్రశాంతంగా వీక్షించడం, పౌర్ణమి రోజున ఆగ్నేయంలో పాలు పొంగించటం, చల్లార్చిన పాలు తాగటం మొదలైన చిరు ప్రత్యామ్నాయాల వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి.










గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870