విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ ఆలయంలో వారాంతాలు మరియు ముఖ్య పర్వదినాల్లో అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు ఈవో శీనానాయక్ తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు భక్తులు అంతరాలయ దర్శనం చేయలేరని ఆయన వెల్లడించారు.
Read Also: Srikalahasti: శివరాత్రికి లక్షలాది భక్తులు.. ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి

ఈ నిర్ణయం ప్రధానంగా భక్తుల రద్దీ నియంత్రణ కోసం తీసుకున్నట్లు చెప్పారు. ఆలయం (Indrakeeladri) సందర్శించే సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడం కోసం చర్యలు అమలు చేయనున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ స్థానిక అధికారులను కలిపి, భక్తుల కోసం సౌకర్యాలు, రద్దీ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను ఖచ్చితంగా చేపట్టాలని ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: