📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం

TTD: తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం

Author Icon By Anusha
Updated: May 13, 2025 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది,టీటీడీ యువత కోసం గోవింద కోటి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. యువతలో ఆధ్యాత్మిక భావనలు పెంచడానికి, సనాతన ధర్మంపై ఆసక్తి కలిగించడానికి రెండేళ్ల క్రితం ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. రామకోటి తరహాలోనే ఈ గోవింద కోటి కార్యక్రమం కూడా ఉంటుంది. గోవింద కోటి రాసిన యువతకు టీటీడీ వీఐపీ దర్శనం(VIP break darshan) కల్పిస్తోంది. 25 ఏళ్లలోపు వయసున్నవారు 10,01,116 సార్లు గోవింద నామం రాస్తే వారికి ఈ అవకాశం దక్కుతుంది. కోటిసార్లు రాస్తే రాసిన వారితో పాటుగా కుటుంబ సభ్యులకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది.టీటీడీ గోవింద కోటి నామాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది,టీటీడీ సమాచార కేంద్రాల్లో, పుస్తకాల షాపుల్లో, ఆన్‌లైన్‌లో కూడా ఈ పుస్తకాలు దొరుకుతాయి. ఒక పుస్తకంలో 200 పేజీలు ఉంటాయి.ఒక్కో పుస్తకంలో 39,600 నామాలు రాయవచ్చు. ఇలా 10,01,116 నామాలు రాయాలంటే దాదాపు 26 పుస్తకాలు కావాలి. కోటి నామాలు రాయడానికి కనీసం మూడేళ్లు పడుతుందని టీటీడీ అంచనా వేసింది. గోవిందకోటి నామాల పుస్తకాన్ని పూర్తి చేసిన తర్వాత తిరుమలలోని టీటీడీ పేష్కార్, కార్యాలయం(Peshkar Office)లో అందజేయాలి. అప్పుడు వారికి మరుసటి రోజు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తామని పేష్కార్ రామకృష్ణ తెలిపారు.

వీఐపీ బ్రేక్ దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం

మంచి అవకాశం

గతేడాది కర్ణాటకకు చెందిన కీర్తన అనే అమ్మాయి మొదటిసారిగా ఈ పుస్తకాన్ని పూర్తి చేసింది. ఆమె బెంగళూరులో ఇంటర్ చదివింది,ఆమె 10,01,116 సార్లు గోవింద నామం రాసి టీటీడీకి అందజేసింది. ఆ అమ్మాయికి టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. ఆ తర్వాత మరో ఇద్దరు కూడా గోవిందకోటి నామాలు రాసి వీఐపీ బ్రేక్ దర్శనం పొందారని టీటీడీ అధికారులు చెప్పారు. తిరుమల శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ కోరుతోంది. గోవింద కోటి నామాలు పూర్తి చేసి ఉచితంగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందాలని టీటీడీ సూచించింది. యువతకు ఇది మంచి అవకాశం అంటున్నారు.తిరుమలలో సోమవారం రాత్రి 7 గంటలకు వైశాఖ పౌర్ణమి(Vaisakha Purnima) గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమై రాత్రి 9గం వరకు కొనసాగింది. స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడంతో తిరుమాడ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో నాలుగుమాడ వీధులలో భజనలు, కోలాటాలు, చెక్క భజనలు కోలాహాలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read Also : Tirumala: మరోసారి తిరుమలలో చిరుత కలకలం

#FreeDarshan #GovindaKoti #TirumalaDarshan #TTDUpdates #VIPBreakDarshan Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.