తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. అలాగే భక్తుల విశ్వాసాలకు భంగం వాటిల్లకుండా ఆగమ శాస్త్ర నియమ నిబంధనల ప్రకారం తిరుమలలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. అయితే అప్పుడప్పుడూ తిరుమలలో అపచారం ఘటనలు చోటు చేసుకోవటం చూస్తూనే ఉన్నాం.తిరుమలలో డ్రోన్ల సంచారం వంటి వార్తలు వింటూ విన్నాం. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది.ప్రస్తుతం డ్రోన్ల ద్వారానే దాడులు జరుగుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. భారత్, పాకిస్థాన్, ఉక్రెయిన్, రష్యా మధ్య కూడా ఇలాంటి డ్రోన్ల దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో చిన్న పరికరమే కదా అని తేలిగ్గా తీసుకోకూడదు.
ప్రకారం
ఈ నేపథ్యంలోనే శ్రీవారి భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ(Anti-drone technology)ని తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను పాలకమండలి ఆదేశించింది. అలాగే డీఆర్‌డీవో(DRDO) సిఫార్సుతో ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ సంస్థ నుంచి యాంటీ డ్రోన్ పరికరం కొనేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. దీనిపై డెమో కూడా ఇవ్వనున్నట్లు తెలిసింది.
ప్రజెంటేషన్
దేశంలోని పరిస్థితుల దృష్ట్యా తిరుమలలో భద్రతను మరింత పటిష్టం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) తిరుమల భద్రతపై శుక్రవారం సమీక్ష జరిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆ తర్వాత తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు(EO Shyamala Rao), తిరుపతి ఎస్పీ, టీటీడీ ఇంఛార్జి సీవీఎస్‌వో హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమలలో భక్తుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను టీటీడీ ఇంఛార్జి సీవీఎస్‌వో హర్షవర్ధన్ రాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Read Also: Chandrababu Naidu: చంద్రబాబు వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి ఫైర్