📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD: ఎన్నారై భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం

Author Icon By Anusha
Updated: May 25, 2025 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతి రోజు వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి తరలి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. వేసవి సెలవులు, ఇతర పర్వదినాల వేళ తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చర్యలు తీసుకుంటుంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్లేందుకు అవసరమై చర్యలు తీసుకుంటుంది. భక్తుల కోసం నిత్యం రకరకాల కార్యక్రమాలు ప్రారంభిస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ ఎన్నారై(NRI) భక్తుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అలానే తిరుమలలో మరో కొత్త సేవను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. 

వివరాలు

ఎన్నారైలు కూడా శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని టీటీడీ ఈవో జె.శ్యామలరావు(J. Shyamala Rao) తెలిపారు. శనివారం నాడు డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నారైలూ కూడా శ్రీవారి సేవ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలానే గోమాత సేవ చేసేందుకు కొత్తగా ‘గో సేవ’ను అందుబాటులోకి తీసుకురానున్నామని వెల్లడించారు. స్థానిక అన్నమయ్య భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్యామలరావుతో పాటుగా అదనపు ఈఓ వెంకయ్య చౌదరి(Venkaiah Chowdhury) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టబోయే పలు అభివృద్ధి ప్రణాళికలు వివరించారు.తిరుమలలో నిర్వహించే శ్రీవారి సేవలో పాల్గొనడం కోసం భక్తులు ఆసక్తి చూపుతుంటారు. ఈక్రమంలో శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేయాలని టీటీడీ నిర్ణయించుకుంది. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేయాలని ఈఓ శ్యామలరావు అధికారులను ఆదేశించారు. అంతేకాక దీనిపై చర్చించేందుకు శనివారం టీటీడీ పరిపాలనా భవనంలో 14 దేశాలకు చెందిన ఎన్నారైలతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించి వారితో మాట్లాడారు. ‘మెడిసిన్, ఐటీ, ఇంజినీరింగ్‌ తదితర విభాగాల్లో సేవలందించేందుకు ఎన్నారైలు ముందుకు వస్తున్నారు. వారి సేవలను వినియోగించుకునేందుకు ప్రణాళికలు తయారు చేయాలి’ అని ఈఓ శ్యామలరావు అధికారులను ఆదేశించారు.

TTD: ఎన్నారై భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం

అమరావతి

అనంతరం శ్యామలరావు మాట్లాడుతూ ‘తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. ఇందుకోసం టీటీడీ పట్టణ ప్రణాళిక విభాగం ఏర్పాటు చేశాం. పలు దశల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తాం. ముందుగా శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం(Sri Padmavati Ammavari Temple), ఆ తర్వాత రెండో దశలో అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయం మూడో దశలో ఒంటిమిట్ట కోదండ రామాలయం, చివరగా తిరుమలలోని ఆకాశగంగ, పాపవినాశనం అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. ఇందుకోసం మాస్టర్‌ప్లాన్‌ తయారు చేసేందుకు చర్యలుచేపట్టాం’ అని ఈఓ శ్యామలరావు వెల్లడించారు.

Read Also : Chandrababu : కొత్త ఇంట్లోకి సీఎం గృహప్రవేశం

#GoSeva #NRISeva #SrivariSeva #Tirumala #ttd Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.