📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD: తిరుమల దర్శనాల పేరుతో మోసపోయిన తెలంగాణ భార్యాభర్తలు

Author Icon By Anusha
Updated: June 28, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకోని భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా వేలాదిమంది భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. అయితే ఈ భక్తిశ్రద్ధను కొంతమంది మోసగాళ్లు తమ స్వార్థపరమైన ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసుకుంటున్నారు. టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) పదేపదే హెచ్చరికలు జారీ చేస్తూ టికెట్ల కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దని స్పష్టం చేస్తున్నా, కొందరు భక్తులు ఇంకా ఆ వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ (Srinivas) అనే భక్తుడు భార్యతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావించారు. అందుకే దర్శనం కోసం సేవా టికెట్లు కోసం ప్రయత్నించారు. అయితే శ్రీనివాస్ తనకు తెలిసినవారి ద్వారా తిరుపతికి చెందిన పోతిరెడ్డి, శేఖర్‌ అనే ఇద్దరు వ్యక్తుల్ని ఆశ్రయించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

భక్తుడు శ్రీనివాస్ సేవా టికెట్ల కోసం రూ.43 వేలు డబ్బులు జమచేయమని పోతిరెడ్డి, శేఖర్ చెప్పారు. శుక్రవారం (జూన్ 27న) దర్శనానికి రమ్మని చెప్పారు. పాపం శ్రీనివాస్‌ నేరుగా తిరుపతికి వచ్చి వారికి ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. వెంటనే బాధితులు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు (Investigation) చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుందామని ఆశగా వస్తే, ఇలా మోసం చేస్తారని అనుకోలేదన్నారు శ్రీనివాస్. దర్శనం, సేవా టికెట్లు, వసతి గదుల పేరుతో ఎవరైనా మాయ మాటలు చెబితే నమ్మొద్దని టీటీడీ, పోలీసులు భక్తుల్ని హెచ్చరించారు.

వ్యక్తిగతంగా టికెట్లు ఇప్పిస్తానంటూ డబ్బులు అడిగితే

ఈ ఘటన నేపథ్యంలో టీటీడీ మరోసారి భక్తులకు హెచ్చరిక జారీ చేసింది. “దేవస్థానం టికెట్లు పొందడానికి మధ్యవర్తులు అవసరం లేదు. అధికారిక వెబ్‌సైట్ మరియు అప్లికేషన్‌ల ద్వారా మాత్రమే సేవలను పొందాలి. ఎవరైనా వ్యక్తిగతంగా టికెట్లు ఇప్పిస్తానంటూ డబ్బులు అడిగితే, వెంటనే మాకు సమాచారం ఇవ్వండి” అని విజిలెన్స్ అధికారులు (Vigilance officers) పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి సేవ (Tirumala Srivari Seva) అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి పవిత్ర యాత్రలో ఈ తరహా మోసాలు చోటుచేసుకోవడం బాధాకరం. భక్తులు ఎప్పుడూ అధికారిక మార్గాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తుల మాటలు నమ్మవద్దని అధికారులు, భక్తసంఘాలు సూచిస్తున్నాయి.

Read Also: Gottipati Ravi Kumar: ఏపీలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు పై మంత్రి కీలక ప్రకటన

#FakeDarshanScam #TirumalaDarshan #TTDAlert #TTDTicketsFraud Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.