📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు

Author Icon By Anusha
Updated: June 24, 2025 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమలలో భక్తులకు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించడమే కాకుండా, సంప్రదాయ కళలతో కూడిన విలువైన చారిత్రక విషయాలను పరిచయం చేయడంలో టీటీడీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. తిరుమలలో శ్రీ వేంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.ఈ మ్యూజియాన్ని మరింత అభివృద్ధి చేయడంపై ఇటీవల TTD (తిరుమల తిరుపతి దేవస్థానం) అదనపు కార్యనిర్వాహణాధికారి ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు.’చీఫ్ మ్యూజియం ఆఫీసర్ (ఇంఛార్జ్) సోమన్ నారాయణ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అదనపు ఈవోకు మ్యూజియంలో ప్రస్తుత అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. మ్యూజియాన్ని ప్రపంచ స్థాయి వస్తు ప్రదర్శనశాలగా తీర్చిదిద్దాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి (EO CH Venkaiah Chowdhary) అధికారులకు సూచించారు. భద్రతా పరంగా తీదుకోవాల్సిన సమగ్ర చర్యలు, ఆధునిక సాంకేతికత ఆధారంగా సీసీ కెమెరాలు, హెడ్ కౌంట్ సెన్సార్లు, గార్డులు, గైడులు, తదితరాలను ఏర్పాటు చేయాలి’ అని అదనపు ఈవో సంబంధిత అధికారులను ఆదేశించారు.

TTD

అధికారులను ఆదేశించారు

మ్యూజియం ప్రాంగణంలో అభిప్రాయ సేకరణ కోసం ఫీడ్‌బ్యాక్ కియోస్క్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఆయన మ్యూజియం (Sri Venkateswara Museum) తెరిచే సమయం, టికెట్ ధర, కళాఖండాల సంరక్షణ గది, అధికారిక సెల్ఫీ పాయింట్ తదితర అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న అన్ని పనులను నిర్దేశించిన సమయం లో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో టీటీడీ సీఈ సత్య నారాయణ, ట్రాన్స్‌పోర్ట్ జీఎం శేషారెడ్డి, ఈఈలు సుబ్రహ్మణ్యం (Subrahmanyam), శ్రీనివాస్, మనోహర్, డీఈ ఎలక్ట్రికల్ చంద్రశేఖర్, వీజీవో సురేంద్ర, హెల్త్ ఆఫీసర్ డా మధుసూదన్, మ్యూజియం క్యూరేటర్ శివకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు’ అని టీటీడీ తెలిపింది.శ్రీ వేంకటేశ్వర మ్యూజియాన్ని తిరుమలలో మరో ముఖ్య ఆకర్షణగా మార్చే లక్ష్యంతో టీటీడీ కసరత్తు చేపట్టింది. భక్తులకు విజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక స్పూర్తిని కలిగించేలా మ్యూజియం అభివృద్ధి పనులు సాగుతున్నాయి. త్వరలో ఈ మ్యూజియం దేశం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులకు మరిచిపోలేని అనుభవాన్ని అందించనుంది.

Read Also: Jahnavi: టైటాన్ స్పేస్ మిషన్‌కు ఎంపికైన దండేటి జాహ్నవి

#MuseumDevelopment #SriVenkateswaraMuseum #TirumalaUpdates #TTDInitiatives Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.