📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంపై ధ్వజస్తంభం ప్రతిష్ఠ

Author Icon By Vanipushpa
Updated: April 29, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అక్షయ తృతీయ 2025 నేపథ్యంలో అయోధ్య రామమందిరంపై జెండా పోల్​ను ప్రతిష్టించారు. ఆలయ శిఖరంపైన జెండా స్తంభా​న్ని సంప్రదాయల ప్రకారం కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ వెల్లడించారు. 42 అడుగుల పొడవైన ఈ స్తంభాన్ని హిందూ క్యాలెండర్​ ప్రకారం వైశాఖ శుక్ల ద్వితీయ ముహూర్తంలో ఉదయం 8గంటలకు పెట్టినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కాగా, ఉదయం 8 గంటలకు పూర్తైనట్లు వివరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

శరవేగంగా రామమందిర నిర్మాణ పనులు
మరోవైపు అయోధ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఏడు మండపాల నిర్మాణం పూర్తి కానున్నట్లు చంపత్ రాయ్ చెప్పారు. రామ్ దర్బార్​లోని విగ్రహాలు మే నెలలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో శివాలయం, నైరుతి మూలలో సూర్య దేవాలయం నిర్మిస్తున్నట్లు వివరించారు. 2025 అక్టోబర్​ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కాగా, ఇప్పటికే అయోధ్య రామాలయ మొదటి అంతస్తులో సీత, లక్ష్మణ, హనుమాన్‌, భరత, శతృఘ్న సమేతుడైన శ్రీరాముని పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
80 మీటర్ల పొడవున్న ఓ సొరంగాన్ని సిద్ధం
ఇటీవలె అయోధ్యలో రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల రాకపోకలను మరింత సులభతరం చేసేలా 80 మీటర్ల పొడవున్న ఓ సొరంగాన్ని సిద్ధం చేశారు అధికారులు. ప్రదక్షిణ చేసుకునే భక్తులు, ఆలయానికి వచ్చే వారి మధ్య రద్దీ తలెత్తకుండా ఆలయానికి తూర్పు భాగంలో నేల మట్టానికి దాదాపు 15 అడుగుల దిగువన 80 మీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మించినట్లు చెప్పారు. ఈ సొరంగం గుండా ఒకేసారి 1.5 లక్షల మంది భక్తులు ఆలయ ప్రదక్షిణ చేయడానికి వీలు కలుగుతుందని చెబుతున్నారు. దేశంలో ఆలయ ప్రదక్షిణ కోసం నిర్మించిన అతి పెద్ద సొరంగం ఇదేనని అంటున్నారు. ప్రదక్షిణ కోసం 800 మీటర్ల పొడవైన గోడను నిర్మించే ప్రాజెక్టులోనే సొరంగం ఓ భాగమని వివరించారు. అక్టోబరు నాటికి సొరంగం పనులు కూడా 100 శాతం పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: Canada elections: కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ ప్రభంజనం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Flagpole installed Google News in Telugu Latest News in Telugu on Ayodhya Ram Temple Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.