Astrology: చేతుల్లోంచి ఈ వస్తువులు జారి పడితే అశుభ సంకేతాలా?

Read Time:  1 min
Astrology
Astrology
FONT SIZE
GET APP

సాధారణంగా రోజువారీ జీవితంలో మన చేతుల్లోంచి వస్తువులు జారి పడిపోతుంటాయి. ఎక్కువసార్లు వీటిని మనం పెద్దగా పట్టించుకోము. కానీ హిందూ(Astrology) ధర్మశాస్త్రం, శకున శాస్త్రాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన వస్తువులు అనుకోకుండా కింద పడటం భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులకు లేదా గ్రహ ప్రభావాలకు సూచనగా భావిస్తారు.

ఉప్పు నుంచి పూజలో ఉపయోగించే దీపం వరకు ప్రతి వస్తువుకూ ఒక గ్రహం లేదా దైవిక శక్తితో సంబంధం ఉందని నమ్మకం. ఈ వస్తువులు జారి పడినప్పుడు ప్రకృతి మనకు ముందుగానే ఇచ్చే హెచ్చరికగా గుర్తించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Astrology

శకున శాస్త్రం ప్రకారం పడితే జాగ్రత్త వహించాల్సిన వస్తువులు

ఉప్పు

ఉప్పును శుక్రుడు, చంద్ర గ్రహానికి ప్రతీకగా భావిస్తారు. ఉప్పు కింద పడితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు వచ్చే అవకాశముందని శాస్త్రం(Astrology) చెబుతుంది.

పాలు

పాలు చంద్ర గ్రహానికి సంబంధించినవి. పాలు మరిగి పొంగిపోవడం లేదా పాల పాత్ర చేజారడం వల్ల ఇంట్లో ప్రశాంతత తగ్గి, భావోద్వేగ ఒత్తిడులు పెరుగుతాయని నమ్మకం.

నూనె

నూనె శని దేవుడికి ప్రీతికరమైనదిగా పరిగణిస్తారు. నూనె కింద చిందితే పనుల్లో అడ్డంకులు, అనుకోని ఖర్చులు లేదా ప్రమాదాల సూచనగా భావిస్తారు.

బియ్యం లేదా ధాన్యాలు

బియ్యాన్ని అన్నపూర్ణ దేవి స్వరూపంగా చూస్తారు. బియ్యం పాత్ర పడిపోతే ఆహార కొరత, ఆర్థిక సమస్యలకు సంకేతమని శకున శాస్త్రం పేర్కొంటుంది.

పూజ దీపం లేదా హారతి పళ్లెం

పూజ సమయంలో దీపం ఆరిపోవడం లేదా హారతి పళ్లెం చేజారడం చాలా అశుభంగా భావిస్తారు. ఇది దైవ అనుగ్రహంలో లోపం వస్తోందని సూచించే సంకేతంగా చెబుతారు.

మంగళసూత్రం

మంగళసూత్రం జారిపోవడం లేదా నల్లపూసల దారం తెగిపోవడం దాంపత్య జీవితంలో కలహాలు లేదా అపార్థాలకు సంకేతంగా భావిస్తారు.

ఈ అశుభ సంకేతాల ప్రభావాన్ని తగ్గించుకోవడం ఎలా?

ఇలాంటి సంఘటనలు జరిగితే భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఇష్టదైవాన్ని స్మరించాలి. దేవుడిని క్షమాపణ కోరుతూ నామస్మరణ చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అన్నదానం చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం లేదా పక్షులకు ఆహారం వేయడం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.