📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Thiruvananthapuram: దేవుడి ఊరేగింపు కోసం ఏకంగా విమానాల రాకపోకలు ఆగిపోయాయి

Author Icon By Vanipushpa
Updated: April 16, 2025 • 2:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంపైన ఆకాశంలో నిశ్శబ్దం ఆవరించింది. ఏప్రిల్ నెలలో ఒకరోజు ఆ ఎయిర్‌పోర్టులో కొన్నిగంటల పాటు విమానాల రాకపోకలు ఆగిపోయాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడమో, లేదా సాంకేతిక కారణాల వల్లో విమానాశ్రయం మూతపడలేదు, ఎయిర్‌పోర్టులోని రన్‌వే మీదుగా పద్మనాభస్వామి ఊరేగింపు వెళ్లడం కోసం ఈ ఏర్పాట్లు చేశారు. చెక్కరథాలపై, అలంకరించిన ఉత్సవమూర్తులను ఉంచి, రెండు కిలోమీటర్ల రన్‌వేపై ఊరేగింపుగా తీసుకెళ్తారు భక్తులు.

సంప్రదాయం కోసం రన్‌వేను మూసేస్తారు
ఆనవాయితీగా వస్తున్న ఈ సంప్రదాయం కోసం రన్‌వేను కొద్దిగంటల పాటు మూసేస్తారు.
ఈ విమానాశ్రయంలో మామూలు రోజుల్లో 90 వరకూ విమానాల రాకపోకలు (ల్యాండింగ్స్, టేకాఫ్స్) జరుగుతాయి. హిందూ ఉత్సవాల్లో సాధారణంగా కనిపించే ఏనుగులు కూడా రన్‌వేపై సాగే ఈ ఊరేగింపులో పాల్గొంటాయి. కోట్ల రూపాయల సంపదకు నిలయమైన శ్రీ పద్మనాభస్వామి ఆలయం ఏటా నిర్వహించే పెయింకుని ఉత్సవంలో భాగంగా, ఏప్రిల్ 11న ఈ ఊరేగింపు నిర్వహించారు.
ట్రావెన్‌కోర్ సంస్థానాధీశుల ఆధ్వర్యంలో..
పది రోజుల పాటు జరిగే పెయింకుని ఉత్సవాల చివరి రోజున ఈ ఊరేగింపు జరుగుతుంది. ఆలయం వద్ద ప్రారంభమైన ఊరేగింపు విమానాశ్రయం రన్‌వే మీదుగా శంఘుముఘం బీచ్ వరకూ 6 కిలోమీటర్ల దూరం సాగుతుంది. బీచ్‌లో ఉత్సవమూర్తులకు అర్చకులు స్నానం చేయిస్తారు. అనంతరం, వచ్చిన దారిలోనే, రన్‌వే మీదుగా ఊరేగింపు ఆలయానికి చేరుతుంది. 1932లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించిన ట్రావెన్‌కోర్ సంస్థానానికి చెందిన రాజకుటుంబ పెద్ద ఈ ఊరేగింపుకు నాయకత్వం వహిస్తారు.

పద్మనాభస్వామి ఆలయంలో జరిగే అల్‌పాషి పండుగ సమయంలోనూ తిరువనంతపురం విమానాశ్రయంలో కొన్ని గంటల పాటు కార్యకలాపాలు నిలిపేస్తారు. ఈ పండుగ ఏటా అక్టోబర్ లేదా నవంబర్‌లో జరుగుతుంది. మతపరమైన కార్యక్రమాల కోసం మూతపడే ప్రపంచంలోని అతికొద్ది విమానాశ్రయాల్లో తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా ఒకటి.

Read Also: Pareeksha :మూల్యాంకనంలో లోపాలు విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదం

#telugu News All flights are stopped Ap News in Telugu Breaking News in Telugu for the procession of the god Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.