Delhi Election Results.. Kejriwal defeat

Delhi Election Results : కేజ్రీవాల్‌ పరాజయం..

Delhi Election Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌కు షాక్‌ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ ను బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఓడించారు. 3 వేల పైచిలుకు ఓట్లతో పర్వేశ్ గెలుపొందారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా కేజ్రీవాల్ కనీసం ఎమ్మెల్యేగా నెగ్గపోవడం ఆప్‌ను మరింత బాధిస్తోంది. ఇప్పటి వరకు ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలుపొందారు అరవింద్ కేజ్రీవాల్. అయితే నాలుగోసారి కూడా గెలుస్తారని భావించారు. కానీ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో కేజ్రీవాల్‌ను న్యూ ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు.

Advertisements
image

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం ఆప్ ఖాతాలోనే పడింది. కోండ్లి నియోజకవర్గంలో తొలి ఫలితం వెలువడింది. ఈ నియోజకవర్గంలో ఆప్ తరఫున పోటీ చేసిన కుల్ దీప్ కుమార్ గెలుపొందారు. బీజీపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్‌పై కుల్ దీప్ 6,293 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కాగా, లక్ష్మీనగర్‌ నియోజకవర్గంలో అభయ్‌ వర్మ విజయం సాధించడంతో బీజేపీ ఖాతా తెరిచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, వాటర్ స్కాం, అవినీతి ఆరోపణలు ఆప్ కొంపముంచాయి అని ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థం అవుతుంది.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌లో 70 అసెంబ్లీ సీట్ల‌కు గాను.. ఆప్ 67 సీట్లు సాధించి బంప‌ర్ విక్ట‌రీ కొట్టింది. అర్వింద్ కేజ్రీవాల్‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న న‌మ్మ‌కమే ఆప్‌ను అత్యంత మెజార్టీతో ప్ర‌జ‌లు గెలిపించారు. కానీ అదే వ్య‌క్తిని ఇప్పుడు ప్ర‌జ‌లు ఛీకొడుతున్నారు. ఇందుకు ప్రధాన కార‌ణాలు ఇవే అని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

అర్వింద్ కేజ్రీవాల్‌ను ప్ర‌జ‌లు ఆద‌రించడానికి ముఖ్య కార‌ణం.. ఆయ‌నపై ఉన్న క్లీన్ ఇమేజ్‌. అవినీతి ర‌హిత పాల‌న అందిస్తాడ‌నే పేరు కేజ్రీవాల్ సొంతం. వీటితో పాటు విద్యా, వైద్య రంగాల్లో ఆయ‌న తీసుకొచ్చిన మార్పులు దేశానికే త‌ల‌మానికంగా మారాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా కూడా కేజ్రీవాల్‌పై సానుకూల అభిప్రాయం ఉంది. ఐతే, గ‌త ఏడాది లిక్క‌ర్ పాల‌సీ స్కామ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు. దాదాపు ఐదు నెల‌ల పాటు జైలు జీవితం గ‌డిపాడు. ఢిల్లీలో తీసుకొచ్చిన కొత్త లిక్క‌ర్ పాల‌సీలో క్విడ్ ప్రో కో జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌ల‌తో కేజ్రీవాల్‌తో పాటు, ఆప్ కీల‌క నేత‌లైన‌ మ‌నీష్ సిసోడియా, సంజ‌య్ కూడా జైలుకు వెళ్లారు. దీంతో ప్ర‌జ‌ల్లో ఆప్ నేత‌లు త‌ప్పు చేశార‌న్న అభిప్రాయం ఏర్ప‌డింది.

కేజ్రీవాల్‌ను ప్ర‌జ‌ల న‌మ్మ‌డానికి మ‌రో ముఖ్య కార‌ణం.. ఆయ‌న సింప్లిసిటీ. ఆయ‌న ఆఫీస్‌కు వెళ్లినా.. రోడ్డుపై మార్నింగ్ వాక్ చేసినా.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయినా ఆయ‌న వేష‌ధార‌ణ సాధార‌ణంగా ఉంటుంది. ఆయ‌న వాడే కారు కూడా మిగ‌తా సీఎంల లాగా ఖ‌రీదైన‌వి ఉండ‌వు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఆయ‌న‌ను చూస్తే మ‌న ప‌క్కింటి అంకుల్‌ను చూసిన ఫీలింగ్ వ‌స్తుంది. ప్ర‌జ‌ల‌కు కూడా నిత్యం అందుబాటులో ఉండాటు కేజ్రీవాల్‌.

Related Posts
ILayaraja: ఇళయరాజ లీగల్‌ నోటీసులు స్పందించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ నిర్మాణ సంస్థ
ILayaraja: ఇళయరాజ లీగల్‌ నోటీసులు స్పందించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ నిర్మాణ సంస్థ

తమిళ హీరో అజిత్, డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో త్రిష హీరోయిన్‌ Read more

నేడు జాతీయ యువజన దినోత్సవం
నేడు జాతీయ యువజన దినోత్సవం

1984లో, భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుండి ఈ వేడుక స్వామి వివేకానంద బోధనలు, తత్వశాస్త్రాలను గుర్తు చేస్తూ యువతకు ప్రేరణగా Read more

రేవంత్ ను మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి – కేటీఆర్
విషాదంలోనూ మంత్రులు వినోదాలు:కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాల మరణాన్ని కోరుకోవడం రాజకీయాల్లో నీచమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ Read more

నకిలీ కుల సర్వే అంటూ తగలబెట్టిన తీన్మార్ మల్లన్న!
నకిలీ కుల సర్వే అంటూ తగలబెట్టిన తీన్మార్ మల్లన్న!

తెలంగాణ అసెంబ్లీలో బీసీ సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్‌లో పెద్ద చర్చకు దారితీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ ప్రకటనపై తీవ్రంగా Read more

Advertisements
×