ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అసెంబ్లీలో నిద్రపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సభలో సభ్యులు చర్చలు జరుపుతున్న సమయంలో ఆమె కునుకు తీశారు. ఈ దృశ్యాలు కెమెరాలకు చిక్కడంతో విపక్షాలు ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలోనే సీఎం నిద్రపోతే, ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందనే ప్రశ్నలు ఉత్థిపత్తి అవుతున్నాయి.

“ఇదేనా ముఖ్యమంత్రి బాధ్యత?”
ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. “ఇదేనా ముఖ్యమంత్రి బాధ్యత?”, “తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే నిద్రపోతే, భవిష్యత్‌లో పాలన ఎలా ఉంటుందో!” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఢిల్లీని దేవుడే కాపాడాలని కొందరు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మరికొందరు విమర్శలు చేస్తున్నారు. విపక్షాలు కూడా ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ “ఇంత అలసటగా ఉన్నారా? లేక ప్రభుత్వ పనితీరు చూస్తేనే విసుగు వచ్చిందా?” అంటూ ఎద్దేవా చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి ఇటువంటి ఘనత సాధించడం దారుణం
దీనిపై ఇంకా అధికారికంగా రేఖా గుప్తా స్పందించలేదు. అయితే, ఇది పొరపాటుగా జరిగినదని, అసెంబ్లీలో చర్చలు దీర్ఘకాలం సాగడంతో అలసట కారణంగా ఆమె కునుకు తీసివుండొచ్చని ఆమె అనుకూల వర్గాలు చెబుతున్నాయి. కానీ, ప్రజా ప్రతినిధి అయిన ఓ ముఖ్యమంత్రి ఇటువంటి ఘనత సాధించడం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశం మరింత రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.