ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు.ఈ వీడియోలో ఆయన స్వయంగా బ్రష్ పట్టుకుని, అమరావతి కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించిన రాష్ట్ర పటానికి రంగులు అద్దిన తీరు ఆకట్టుకుంటోంది. తన సృజనాత్మకతను ప్రదర్శిస్తూ, అభివృద్ధి దిశగా రాష్ట్ర భవిష్యత్‌ను రూపుదిద్దుతున్న భావన కలిగించేలా ఈ వీడియో ఉంది.”ఇవాళ పెయింటింగ్ వేయడానికి ప్రయత్నించాను. కళకు ఎంతో ఓపిక అవసరం.తమ ఊహలకు రంగులు అద్దే కళాకారుల పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది,” అని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

చంద్రబాబు కళా ప్రేమను చూసి నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.అమరావతికి ఆయన చూపిస్తున్న నిబద్ధత, అభివృద్ధి తీరును ఈ వీడియో స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.పలు రాజకీయ నేతలు, కళాకారులు, సాధారణ ప్రజలు ఆయన ప్రయత్నాన్ని కొనియాడుతున్నారు.ఈ వీడియోను చూసిన వారిలో కొందరు చంద్రబాబు నాయుడిని ‘ఆర్టిస్ట్ సీఎం’ అని సంబోధిస్తున్నారు.ఆయన అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతకు ఇది ఓ నిదర్శనమని చెబుతున్నారు.కళ అంటే కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, ఒక రాష్ట్ర రూపకల్పనలో కూడా కీలకంగా ఉంటుందని ఆయన నిరూపించినట్లుగా అభిప్రాయపడుతున్నారు.ఈ వీడియోకు వేలాది లైకులు, షేర్లు రావడం విశేషం.