हिन्दी | Epaper
నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం?

IPL 2025: లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

Anusha
IPL 2025: లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ మరోసారి సత్తా చాటింది. బౌలర్లతో పాటు బ్యాటర్లూ సమిష్టిగా రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ప్రత్యర్థిపై 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ సీజన్‌ ఆరంభంలో ఢిల్లీ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలన్న లక్నో ఆశలపై నీళ్లు చల్లుతూ.. ఆ జట్టు నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే దంచేసింది. రాహుల్‌ (42 బంతుల్లో 57 నాటౌట్‌, 3ఫోర్లు, 3సిక్స్‌లు), అభిషేక్‌ పొరెల్‌ (36 బంతుల్లో 51, 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలతో రాణించారు. తొలుత లక్నో ఢిల్లీ బౌలర్ల ధాటికి 159/6కే పరిమితమైంది. మార్క్మ్‌ (33 బంతుల్లో 52, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆల్‌రౌండ్‌ (బంతితో 2/30) మెరుపులు వృథా అయ్యాయి. క్యాపిటల్స్‌ బౌలర్‌ ముకేశ్‌ కుమార్‌ (4/33) లక్నోను దెబ్బతీశాడు.

సిక్సర్‌

స్వల్ప ఛేదనను ఢిల్లీ దూకుడుగా ఆడి 17.5 ఓవర్లలోనే దంచేసింది. యువ ఓపెనర్‌ పొరెల్‌.. రాహుల్‌తో పాటు అక్షర్‌ పటేల్‌ (34 నాటౌట్‌) ధనాధన్‌ మెరుపులతో లక్ష్యం మరింత చిన్నదైంది. రెండు బౌండరీలు, ఓ సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను వేగంగా మొదలుపెట్టిన కరుణ్‌ నాయర్‌ (15) మార్క్మ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరినా ఈ త్రయం దంచడంతో లక్నోకు ఓటమి తప్పలేదు. పొరెల్‌ తొలి ఓవర్‌ నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. బిష్ణోయ్‌ 11వ ఓవర్లో 83 మీటర్ల భారీ సిక్సర్‌తో పొరెల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తిచేశాడు.ఇదే ఓవర్లో రాహుల్‌ కూడా 86 మీటర్ల సిక్సర్‌ బాదాడు. అయితే మార్క్మ్‌ 12వ ఓవర్లో భారీ షాట్‌ ఆడబోయిన పొరెల్‌ డీప్‌ మిడ్‌ వికెట్‌ వద్ద మిల్లర్‌ చేతికి చిక్కడంతో 69 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. పొరెల్‌ నిష్క్రమించినా అక్షర్‌ దూకుడు ఆపలేదు. బిష్ణోయ్‌ 14వ ఓవర్లో అతడు రెండు భారీ సిక్సర్లు బాదిన అక్షర్‌.. దిగ్వేశ్‌ బౌలింగ్‌లోనూ బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. తన మాజీ జట్టు అయిన లక్నోపై రాహుల్‌ రాణించడం మ్యాచ్‌లో కొసమెరుపు.

 IPL 2025: లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

మార్ష్‌

స్లో టర్నర్‌ అయిన లక్నో పిచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భిన్నంగా స్పందించడంతో పంత్‌ సేనకు బ్యాటింగ్‌ తిప్పలు తప్పలేదు. పిచ్‌ స్వభావం తెలిసిన ఢిల్లీ సారథి అక్షర్‌ బౌలింగ్‌ దాడిని ప్రారంభించడంతో పాటు పవర్‌ ప్లేలో వరుసగా మూడు ఓవర్లూ (19 పరుగులే ఇచ్చాడు) తానే వేశాడు. మార్ష్‌ (45) బ్యాట్‌ ఝుళిపించేందుకు ఇబ్బందులు పడగా మార్క్మ్‌ కూడా ఆరంభంలో తడబడ్డా తర్వాత పుంజుకున్నాడు.ముకేశ్‌ 4వ ఓవర్లో అతడు 4, 6 కొట్టగా చమీర ఓవర్లో మార్ష్‌ సిక్సర్‌తో లక్నో 50 పరుగుల మార్కును అందుకుంది. గత ఆరు ఇన్నింగ్స్‌లలో అతడికి ఇది నాలుగో అర్ధ శతకం. కానీ మార్క్మ్‌, మార్ష్‌ క్రీజులో ఉన్నా 10 ఓవర్లకు లక్నో చేసింది 87 పరుగులే. 9వ ఓవర్‌ ఆఖరి బంతికి చమీర మార్క్మ్‌న్రు ఔట్‌ చేసి 87 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరదించాడు. పూరన్‌ (9)ను స్టార్క్‌ బోల్తా కొట్టించాడు. ముకేశ్‌ 14వ ఓవర్లో సమద్‌ (2)తో పాటు మార్ష్‌నూ ఔట్‌ చేసి లక్నోకు డబుల్‌ షాకులిచ్చాడు. బదోని (21 బంతుల్లో 36, 6 ఫోర్లు) వేగంగా ఆడగా 15 బంతులెదుర్కున్న మిల్లర్‌ (14 నాటౌట్‌) ధాటిగా ఆడలేకపోయాడు.

Read Also: KL Rahul : గోయెంకాతో విభేదాలు స్పందించిన కేఎల్ రాహుల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870