దిగజారుడు పాలిటిక్స్: రాజకీయాల దిగజారడం
ఇంత నోటి దూల ఏం మాటలు ఇవి? కొంచెమైనా లిమిట్స్ ఉండవా? ఈ స్థాయికి దిగజారి మాట్లాడతారా? రాజకీయాలు దిగజారడానికి బహుశా ఇంతకంటే ఏం మిగలలేదేమో. వాళ్ళు అధికారంలో ఉంటే, వీళ్ళని వీళ్ళు అధికారంలో ఉంటే, వాళ్ళను వ్యక్తిగత స్థాయికి దిగి, ఇళ్లలో ఆడవాళ్ళని నీచమైన మాటలు అంటున్నారు. అడ్డంగా దిగజారి మాట్లాడుతున్నారు. ఈ బూతులు, ఈ మాటలు నిజంగా దిగజారుడు పాలిటిక్స్ కే ఉదాహరణగా మారిపోయాయి.
ఆయన మాటలు – ఐటిడిపి కార్యకర్త చేబ్రోల్ కిరణ్ కుమార్
లేటెస్ట్ గా ఐటిడిపి కార్యకర్త చేబ్రోల్ కిరణ్ కుమార్ ఇలాంటి కామెంట్స్ చేశాడు. కొంతకాలంగా ఏపీ పాలిటిక్స్ ఇలాంటి బూతులకు అడ్డాగా మారింది. ఒకప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థిపై విమర్శలు చేసేవాళ్ళు, అలాంటి విమర్శలు పాలసీ, పనితీరుకు సంబంధించినవి, అవినీతికి సంబంధించి ఉండేవి. కానీ ఇప్పుడు వాటి గురించి ఎవరు ఏం మాట్లాడడం లేదు. ఎవరెంత తిన్నారు, ఎవరెలాంటి పనులు చేశారు, ఎవరఏది చేయలేదు అనే వాటిని పట్టించుకోవడం లేదు. అందరూ నెక్స్ట్ లెవెల్ కి దిగజారిపోయారు.
ప్రపంచం పైకి ఎదగాలి, ఏపీ రాజకీయాలు మాత్రం దిగజారుతున్నాయి
ప్రపంచంఅంతా పైకి, ముందుకు వెళ్ళాలి అనుకుంటుంది. కానీ ఏపీలో రాజకీయ పార్టీలు మాత్రం పాతాళ మంచులు వెతుక్కుంటూ కిందికి కిందికి పోతున్నాయి. ఐటిడిపి కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ నోటి దూల కామెంట్ల తర్వాత, టిడిపి కొంచెం ఎల్లట్ట అయింది. గతంలో తమ నాయకుడిని కూడా ఇలాగే అన్న విషయం వాళ్ళు మర్చిపోయి ఉండకపోవచ్చు.
గన్నవరం టిడిపి ఆఫీస్ పై దాడి మరియు నోటి దూల మాట్లాడే సాంప్రదాయాలు ఇప్పుడు, వల్భనేని వంశి జైల్లో ఉన్నాడు అంటే దాని వెనుక గన్నవరం టిడిపి ఆఫీస్ పై దాడి కంటే, ఇలాంటి నోటిదూల మాటలే కారణం. రీసెంట్ గా పోసాని కూడా కేసులు జైళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే, దానికి కూడా ఇదే కారణం. ఎందుకంటే, ఇలాంటి మాటలు అన్నప్పుడు, మాటలు పడ్డవాళ్ళు ఒకవేళ విపక్షంలో ఉంటే, వాళ్ళు టైం కోసం చూస్తారు.
ప్రతిపక్షం అస్తిత్వాన్ని నిలబెట్టడం మరియు విమర్శలు
అధికారం వచ్చిన తర్వాత అన్ని చేతిలో ఉంటాయి కాబట్టి, టైం చూసుకొని మూసేస్తారు. దీనికి ఉదాహరణలు ఇప్పుడు కళ్ళ ముందే ఉన్నాయి. టిడిపి ఇప్పుడు వెంటనే అలర్ట్ అవ్వడం కాస్త మంచి విషయం. మహిళలపై ఇలాంటి కామెంట్లు చేస్తే, ఊరుకునేది లేదు అని చెబ్రోలు, నీ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. టిడిపి కార్యకర్తలే కేసు పెట్టారు, గుంటూరు పోలీసులు కేస్ ఫైల్ చేశారు. ఇది ఇప్పుడు లేటెస్ట్ గా ఐటిడిపి కార్యకర్త గురించి కనిపిస్తున్న విషయం.
సోషల్ మీడియా, రాజకీయాల మధ్య సంబంధం
ఇక, ఇంత వాగిన తర్వాత ఇప్పుడు తప్పయింది, “ఏదో ఆవేశంలో అన్నాను క్షమించండి” అంటున్నాడు ఆ వ్యక్తి. నిజానికి ఈ మాటలు ఈరోజు కొత్తగా అన్నవి కాదు. కానీ ఇప్పుడు YouTube ఛానల్ ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో వైసపి వాళ్ళకు ఆగ్రహం వచ్చింది. వైసపి వాళ్ళ కోపము అదే టైంలో టిడిపి కూడా దీన్ని తప్పే అని గుర్తించింది. దానిపై, ఎదురుతలుపు పక్షం డిమాండ్ చేసే లోపే సస్పెండ్ చేసింది, కేసు పెట్టింది.
ప్రత్యర్థి విమర్శలు – సరైన విధానం
రాజకీయాల్లో పోటీ పడటం తప్పు కాదు. ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం తప్పు కాదు. ఎదుటి పక్షాన్ని నిలదీయడానికి, దెబ్బకొట్టడానికి యువతలి పక్షం ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ ఆ ప్రయత్నాలు సహేతుకంగా ఉండాలి, పాలసీ బేస్డ్ గా ఉండాలి. ప్రజలు కన్విన్స్ అయ్యే కారణాలు చెప్పగలగాలి. అంతే. తప్ప, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, పాల్పడితే ప్రయోజనం ఏంటి?
ఏపీ రాజకీయాలలో ట్రెండ్
తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో గత 10ఏళ్లుగా కనిపిస్తున్న ట్రెండ్ ఇది. సోషల్ మీడియా ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో, స్మార్ట్ ఫోన్లు ఎప్పుడైతే చేతుల్లోకి వచ్చాయో, అప్పటి నుండి ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఏపీలో ఇంత దిగజారిన రాజకీయాలు మరెక్కడా కనిపించవు. ప్రపంచంలో పనికిమాలిన వీడియోలు, బూతులు, ఇంటర్వ్యూలు అడుగడుగున కనిపిస్తాయి.
పాలిటికల్ విజన్లలో మానవీయత
నిజానికి, నిన్న పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రమాదం జరిగినప్పుడు వైసపి నేతలు కూడా స్పందించారు. అది మానవీయ స్పందన. చాలా మంచి విషయం. అంటే రాజకీయాలు ఎలా ఉన్నా, వ్యక్తులుగా ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు అనే విషయంలో ఒక గీత ఖచ్చితంగా ఉండాలి. దాన్ని అందరూ అనుసరించాలి. అప్పుడే రాజకీయాలు హెల్దీగా ఉంటాయి.
సోషల్ మీడియా మరియు రాజకీయాల మార్పు
కానీ సోషల్ మీడియాలో ఇది కనిపించడం లేదు. దీనికి కారణం, రాజకీయ పార్టీలే తమ అవసరాల కోసం సోషల్ మీడియా టీమ్‌లని పెయిడ్ ఆర్టిస్టులను అన్ని రాజకీయ పార్టీలు పెంచి పోషించాయి. అవి ఎన్నికల టైంలో కీ రోల్ పోషించడం కూడా మొదలైంది. సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఇన్ఫ్లయెన్స్ చేయడం కూడా.
నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్
కొన్ని సక్సెస్ అయ్యాయి, చాలాసార్లు అందులో తప్పు లేకపోవచ్చు. కానీ దానికి వచ్చిన సైడ్ ఎఫెక్ట్, అప్పుడప్పుడు కనిపిస్తోంది. అదే ఇప్పుడు మనం చూసాం. ఇద్దరు వ్యక్తులు నాలుగు గోడల మధ్య చెవులు కొరుక్కుంటే అది వాళ్ళ సమస్య. ఎవడేం మాట్లాడినా, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ సంస్కారం. కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఇలా కుటుంబాలను, కుటుంబాల్లో మహిళలను కించపరిచేలా వాళ్ళ వ్యక్తిత్వాన్ని హీనపరిచేలా మాట్లాడటం అత్యంత దారుణమైన విషయం.
మార్పు అవసరం
గతంలో వైసపి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన విషయం ఇప్పుడు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కూడా జరుగుతోంది. అప్పుడు వాళ్ళు వీళ్ళ అధినేతను అన్నారు, ఇప్పుడు వీళ్ళు వాళ్ళ అధినేతను అంటున్నారు. ఏం మార్పు ఉంది? ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వాలు మారాయి, కానీ ట్రెండ్ మారలేదు. మాటలు మారలేదు. ఆ మాటల్లో ఉన్న దిగజారుడుతనం మారలేదు.
విజయ్ సాయి రెడ్డి సిఐడి విచారణ ముగిసింది ఏం అడిగారు ఏం చెప్పారు? మంగళగిరి సిఐడి పోలీసులు విజయ్ సాయి రెడ్డిని ప్రశ్నించారు. కాకినాడ సీపోర్ట్ అధిపతి Read more
టెస్లా భారత్‌కు రాబోతోంది: ఎలన్ మస్క్ ప్రకటన ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత్‌కు రాబోతోంది. ఎలన్ మస్క్ స్వయంగా ఈ విషయాన్ని Read more
కూల్చివేతలతో ఏం నిర్మిస్తారు కూల్చివేతలతో ఏం నిర్మిస్తారు విధ్వంసంతో ఏం ప్రయోజనం సాధిస్తారు ఔరంగజేబు మంచివాడా లేక చెడ్డవాడా ఔరంగజేబ్సమాధిని కూల్చేయండి ఇదే ఇప్పుడు వినిపిస్తున్న డిమాండ్ Read more