పెరుగు (Curd) లోని పోషక గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది ముఖ్యంగా ప్రొబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే, పెరుగు (Curd) శరీరానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన పోషకాల వనరు (A source of nutrients)గా ఉంటుంది. అంతేకాదు, ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి12 ( కోబాలమిన్) , పొటాషియం, భాస్వరం, కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ కొంతమంది పెరుగును చక్కెరతో కలిపి తీసుకోవడం మీరు చూసే ఉంటారు.

గ్లూకోజ్ స్థాయిలు
అయితే చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది దీనిని తీసుకోవడానికి జంకుతుంటారు. కానీ ఈ విధంగా పెరుగుతో కలిపి చక్కెర తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పెరుగుతో చక్కెర కలపడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. అంతే కాదు పెరుగు, చక్కెర మిశ్రమం రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. పెరుగుతో చక్కెర కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అలాగే శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. పిల్లలకు పెరుగు (Curd) , చక్కెర కలిపిన మిశ్రమాన్ని ఇవ్వడం వల్ల వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలసట, ఒత్తిడి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. పెరుగులో చక్కెర కలిపి తీసుకోవడం వల్ల జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. భోజనం తర్వాత ఒక కప్పు పెరుగులో అర టీస్పూన్ చక్కెర కలిపి తీసుకోవడం వల్ల అసిడిటీ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.ఈ విధంగా పెరుగు తీసుకోవడం వల్ల గుండెల్లో మంట సమస్య వెంటనే తగ్గుతుంది.

ఔషధంగా
శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే, పెరుగును చక్కెరతో కలిపి తీసుకోవడం మంచిది. దీని వల్ల శరీరం చల్లబడి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పెరుగులో చక్కెర కలిపి తీసుకోవడం వల్ల శారీరక బలం పెరుగుతుంది.
మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి పెరుగు, చక్కెర కలిపిన మిశ్రమాన్ని తీసుకోవడం మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.
పెరుగులో చక్కెర కలిపి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
పెరుగును ఎవరు కనుగొన్నారు?
పెరుగును మధ్య ఆసియా మరియు మెసొపొటేమియాలోని ప్రారంభ సంచార ప్రజలు 5000 BC ప్రాంతంలో అనుకోకుండా కనుగొన్నారని నమ్ముతారు. జంతువుల కడుపుల వంటి పాత్రలలో నిల్వ చేయబడిన పాలు, పాత్ర యొక్క లైనింగ్‌లో ఉండే బ్యాక్టీరియా కారణంగా సహజంగా పులియబెట్టినప్పుడు ఇది సంభవించవచ్చు. ఈ ప్రమాదవశాత్తు ఆవిష్కరణ ఆహ్లాదకరమైన, ఉప్పగా ఉండే రుచితో సంరక్షించబడిన మరియు చిక్కగా ఉండే పాల ఉత్పత్తిని సృష్టించడానికి దారితీసింది.
పెరుగుకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది?
భారతీయ ఆంగ్లంలో “కర్డ్” అనే పదం తియ్యని సాదా పెరుగును సూచిస్తుంది. ఇది దక్షిణ భారత రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో మరియు పశ్చిమ భారత రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్ మరియు మహారాష్ట్రలలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది.
పెరుగులో ఏ బ్యాక్టీరియా ఉంటుంది?
పాల నుండి పెరుగును మార్చడానికి ప్రధానంగా కారణమయ్యే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. ప్రత్యేకంగా, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ ఈ ప్రక్రియలో పాల్గొనే ఒక సాధారణ జాతి. ఈ బ్యాక్టీరియా పాలలోని చక్కెర అయిన లాక్టోస్‌ను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది. లాక్టిక్ ఆమ్లం పెరుగుదల పాల ప్రోటీన్లు (కేసిన్) గడ్డకట్టడానికి కారణమవుతుంది, ఫలితంగా పెరుగు ఏర్పడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Onions: డయాబెటిస్‌తో బాధపడేవారు పచ్చి ఉల్లి తింటే