మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పటికప్పుడు సరికొత్త అవతారంలో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంటారు. స్టైల్‌లో ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉండే ధోనీ, తన కొత్త లుక్స్‌తో యువతకు ఏమాత్రం తగ్గకుండా డాషింగ్‌గా కనిపిస్తూనే ఉంటాడు. తాజాగా, టీమిండియా – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ధోనీ మరో కొత్త లుక్‌తో ప్రత్యక్షమయ్యాడు. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ప్రాక్టీస్ క్యాంప్
ధోనీ ఇటీవలే ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొనడానికి చెన్నై చేరుకున్నాడు. సీఎస్‌కే జట్టుతో కలిసిన ధోనీ ఫోటోలు, వీడియోలు చెన్నై సూపర్ కింగ్స్ అధికార సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేయగా, అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. అయితే, ఈ క్రమంలో తాజాగా మరో కొత్త ఫోటో పంచుకున్నారు, ఇందులో ధోనీ సంప్రదాయ తమిళ లుక్‌లో దర్శనమిచ్చాడు.
ఇంటర్నెట్ షేక్
ధోనీ వైట్ అండ్ వైట్ పంచెకట్టు, సాఫ్ట్ కాటన్ షర్ట్ ధరించి మరింత స్టైలిష్‌గా కనిపించాడు. చేతిలో ఫోన్, స్టైలిష్ వాచ్, ఫ్యాషన్ గ్లాసెస్, టాప్ బ్రాండ్ షూస్ ధరించి ఓ హోటల్ కారిడార్‌లో నడుస్తూ కనిపించిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ లుక్‌ను చూసిన అభిమానులు ధోనీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
అభిమానులు “హ్యాండ్సమ్, మాస్ లుక్ అదిరింది”, “తమిళనాడు సంప్రదాయ దుస్తుల్లో మహీ స్టన్నింగ్”, “ఫైర్, అల్టిమేట్ స్వాగ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ధోనీపై ఉన్న అభిమానాన్ని ఇది మరోసారి రుజువు చేస్తోంది.క్రికెట్ కెరీర్ మొదట్లో పొడవాటి జుట్టుతో అభిమానులను మెస్మరైజ్ చేసిన ధోనీ, అప్పటి నుంచి ఎప్పుడూ హెయిర్ కటింగ్‌పై కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అతను ఏ కొత్త లుక్‌లో కనిపించినా ఫ్యాన్స్ ఫిదా అయిపోతూనే ఉంటారు. ఈసారి కూడా తమిళ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించడం అభిమానులకు మజిలి విందుగా మారింది.
ధోనీ నాయకత్వం
ఇక ఐపీఎల్ 2025లో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ బలమైన షెడ్యూల్‌ను ఎదుర్కోనుంది. మార్చి 23న ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్, మార్చి 28న బెంగళూరుతో రెండో మ్యాచ్ చెన్నైలో జరగనుంది. ఈ నేపథ్యంలో ధోనీ ప్రాక్టీస్‌లో పాల్గొనడంతో పాటు అభిమానులకు తన మాస్ లుక్‌తో అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు.
తమిళ సాంప్రదాయ దుస్తుల్లో
ధోనీ అనేది కేవలం క్రికెట్ పేరు మాత్రమే కాదు, ఇది ఒక బ్రాండ్. అతని ప్రతి లుక్, అతని ప్రతి అప్‌డేట్ అభిమానులకు ఓ సెలబ్రేషన్‌లా మారుతుంది. ఇప్పుడు తమిళ సాంప్రదాయ దుస్తుల్లో మహీ కనిపించడంతో, సోషల్ మీడియాలో మరోసారి మహీ మ్యానియా కొనసాగుతోంది.