📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Terrorism: విజయనగరం ఉగ్రకుట్ర..విచారణలో విస్తుపోయే విషయాలు

Author Icon By Anusha
Updated: May 25, 2025 • 4:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం ఐఎస్ఐఎస్ ఉగ్రమూలాల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సిరాజ్, సమీర్‌లను పోలీసులు రెండు రోజులుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో సిరాజ్‌కు ఒక అజ్ఞాత వ్యక్తి ప్రోత్సాహం అందించినట్లు తేలింది. అలాగే, గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సిరాజ్(Siraj) చేసిన వ్యాఖ్యలకు ఆ వ్యక్తి స్పందించి, ప్రశంసించాడు. దీంతో ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అని పోలీసులు కూపీలాగుతున్నారు. విజయనగరం పోలీసు ట్రెయినింగ్ అకాడమీ(Police Training Academy)లో శనివారం 7 గంటల పాటు విచారణ జరిగింది. ఈ విచారణలో అనేక విషయాలు తెలిశాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వీడియోపై సిరాజ్‌ సామాజిక మాధ్యమాల్లో స్పందించాడు. దీనిని ఒక అజ్ఞాత వ్యక్తి గుర్తించాడు.

పోలీసులు

సిరాజ్‌ను మెచ్చుకుంటూ అతడికి మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత వారి మధ్య చాటింగ్ మొదలైంది. కొంతకాలానికి ఆ వ్యక్తి తన వివరాలు సిరాజ్‌కు చెప్పాడు. తాను విశాఖకు చెందిన రెవెన్యూ అధికారి(Revenue Officer) అని పరిచయం చేసుకున్నాడు. ఒక వర్గానికి వ్యతిరేకంగా సిరాజ్‌ను ప్రోత్సహించాడు.ఆ వ్యక్తి గురించి సిరాజ్ చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.ఆ వ్యక్తిసిరాజ్‌ను ఎందుకు ప్రోత్సహించాడు? అతడి ఉద్దేశం ఏమిటి? అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. తనను ప్రశంసిస్తూ అతడి నుంచి మెసేజ్‌ వచ్చిందని సిరాజ్ పేర్కొన్నాడు. స్వయంగా అతడు ఫోన్ చేసి అభినందించినట్టు తెలిపాడు. ఇక, ఈ కేసులో మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో బయటపడనున్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ఈ ఉగ్రకుట్ర వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Terrorism: విజయనగరం ఉగ్రకుట్ర..విచారణలో విస్తుపోయే విషయాలు

స్థాపించినట్టు

మరోవైపు, ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సిరాజ్, సమీర్‌లు మరో నలుగురితో కలిసి సోషల్ మీడియా(Social media)లో ఒక రహస్య గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని చాటింగ్‌ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఈ సిరాజ్, సమీర్ కలిసి అల్‌హింద్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ అనే సంస్థను స్థాపించినట్టు తెలిసింది. ఈ ఆరుగురు యువకులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన యువకులుగా పోలీసులు తేల్చారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఈ విషయాలను పోలీసులు పేర్కొన్నారు.

Read Also: IPL 2025: ముంబై ఇండియన్స్‌కు అద్భుత అవకాశం

#ExplosiveRevelations #MysterySupporter #SirajControversy #VizianagaramCase Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.