📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Vijay Rupani: విజయ్‌ రూపానీ మృతదేహం గుర్తింపు?

Author Icon By Anusha
Updated: June 15, 2025 • 2:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఒక్కసారిగా అనేక కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది.మూడు రోజుల క్రితం జరిగిన ఈ విమాన ప్రమాదంలో మొత్తం 274 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్‌ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి (Former CM) విజయ్‌ రూపానీ (Vijay Rupani) మృతదేహాన్ని గుర్తించారు. రూపానీ రక్తసంబంధీకుల డీఎన్‌ఏ (DNA) తో ఘటనా స్థలంలో సేకరించిన శరీర భాగాల డీఎన్‌ఏ మ్యాచ్‌ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం 11.10 గంటలకు డీఎన్‌ఏ టెస్టుకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి.

ప్రభుత్వ లాంఛనాలతో

విజయ్‌ రూపానీ మృతదేహం గుర్తించిన అధికారులు ఆదివారం మధ్యాహ్నం ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు. రాజ్‌కోట్‌ (Rajkot) లో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా గత గురువారం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం కొన్ని సెకన్‌లలోనే కుప్పకూలింది.ఈ ప్రమాదంలో విజయ్‌ రూపానీతోపాటు ఆ విమానంలో ఉన్న 241 మంది ప్రాణాలు కోల్పోయారు. రమేశ్‌ విశ్వాస్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే గాయాలతో బయటపడ్డారు.

Vijay Rupani

ఒక్క వ్యక్తి

అదేవిధంగా విమానం బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ (Medical College Hostel) పై పడటంతో అందులోని పలువురు వైద్యులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారిలో కూడా పరిస్థితి విషమించి కొందరు ప్రాణాలు కోల్పోయారు. దాంతో బీజే హాస్టల్‌ మృతుల సంఖ్య 38కి పెరిగింది. మొత్తం మృతుల సంఖ్య 279కి చేరింది.కాగా,విజయ్ రూపానీ తన భార్య, కుమార్తెను కలిసేందుకు లండన్ (London) వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. వాస్తవానికి, బీజేపీ పంజాబ్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున, అలాగే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి రావడంతో ఆయన లండన్ ప్రయాణాన్ని గతంలో వాయిదా వేసుకున్నారు,ఆయన 2016 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబర్ వరకు గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా సేవలందించారు. విమాన ప్రమాదంలో మరణించిన రెండో గుజరాత్ ముఖ్యమంత్రిగా రూపానీ నిలిచారు. గతంలో 1965లో బల్వంతరాయ్ మెహతా కూడా విమాన ప్రమాదంలోనే కన్నుమూశారు.

Read Also: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్‌- పలువురు మృతి

#AhmedabadPlaneCrash #FormerCM #GujaratNews #VijayRupani Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.