📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Girl: బాలికను వీడియో కాల్‌లో వేధించిన బాలుడు – 8 మందిపై POCSO కేసు

Author Icon By Vanipushpa
Updated: June 23, 2025 • 1:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆదిలాబాద్‌(Adilabad) జిల్లా గుడిహత్నూర్‌ మండలంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహం ముసుగులో ఓ బాలుడు మైనర్ అమ్మాయిని వేధింపులకు గురి చేశాడు. నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాలని ఒత్తడి తేవటంతో పాటు.. దాన్ని రికార్డ్(Video) చేసి తన స్నేహితులకు పంపాడు. స్థానికంగా వీడియో వైరల్ కావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికను బెదిరించి ఆమె నగ్న వీడియోలను రికార్డు చేసి ఇతరులకు పంపిన కేసులో ఇద్దరు మైనర్లతో సహా ఆరుగురిపై పోక్సో (POCSO) కేసు నమోదైంది. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.

Vedio Call: బాలికను వీడియో కాల్‌లో వేధించిన బాలుడు – 8 మందిపై POCSO కేసు

పోలీసుల చర్యలు – ఎనిమిది మందిపై కేసు నమోదు
ఏఎస్పీ కాజల్‌ సింగ్‌(ASP Kajal Singh) వెల్లడించిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్‌(gudihathnoor) మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు సోషల్ మీడియా ద్వారా ఒక బాలుడు (16) పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఆ బాలుడు బాలికను నగ్నంగా వీడియో కాల్‌ చేయమని బెదిరించాడు. అలా చేయకపోతే వారి చాటింగ్‌ను బాలిక తల్లిదండ్రులకు చూపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాలిక నగ్న వీడియోను రికార్డు చేసిన ఆ బాలుడు.. ఆ వీడియోను తన స్నేహితులకు షేర్‌ చేశాడు. ఈ వీడియోలు స్థానికంగా వైరల్ అయ్యాయి. దీంతో సదరు బాధితురాలు మానసిక ఆవేదన గురైంది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.

తల్లిదండ్రులకు పోలీసుల సూచన – పిల్లలపై ఆన్‌లైన్ పర్యవేక్షణ తప్పనిసరి
తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. గుడిహత్నూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. షీ టీమ్ బృందం సహాయంతో గుడిహత్నూర్, ఇచ్చోడ పోలీసులు సీఐ రాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మందిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇద్దరు మైనర్లు సహా.. వంశీకృష్ణ, పవర్‌ తరుణ్‌, సాబ్లె బాలవంత్‌ సింగ్‌, గుండల్వార్‌ వరుణ్‌, కారడ్‌ సుధీర్‌, ముర్కుటే విఠల్‌ అనే వ్యక్తులపై కేసు నమోదు చేసారు. నిందితులను న్యాయమూర్తి ముందు హాజరుపరచగా.. ఇద్దరు మైనర్ బాలురను నిజామాబాద్‌లోని జువైనల్‌ హోంకు తరలించారు. మిగిలిన మేజర్లను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ సంఘటన ద్వారా సమాజం సైబర్ భద్రత, బాలల రక్షణపై మరింత సూక్ష్మమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. POCSO చట్టం కఠినంగా అమలు కావడం ఈ ఘటనలో ముఖ్యమైందని స్పష్టమవుతోంది. అలాంటి దుశ్చర్యలకు గురైతే, జాప్యం లేకుండా పోలీసులను సంప్రదించాలి అని అధికారులు సూచించారు.

Read Also: Chennai: మహిళా ఉద్యోగినిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం

#telugu News ADILABAD Ap News in Telugu Breaking News in Telugu call case Google News in Telugu Latest News in Telugu molestation Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.